మాస్కోలో ఉగ్రదాడి గురించి.. అమెరికా ముందే వార్నింగ్ ఇచ్చిందా ??
అనుకున్నట్టుగానే జరిగింది. అమెరికా చెప్పినట్టే జరిగింది. మాస్కోలో భీకర ఉగ్రదాడి జరగబోతోందని, అప్రమత్తంగా ఉండాలని అమెరికా రష్యాను గతంలోనే హెచ్చరించింది. దీనిని నిజం చేస్తూ తాజాగా రష్యా రాజధాని మాస్కోలో భీకర ఉగ్రదాడి యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి ముష్కరులు జరిపిన కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.
అనుకున్నట్టుగానే జరిగింది. అమెరికా చెప్పినట్టే జరిగింది. మాస్కోలో భీకర ఉగ్రదాడి జరగబోతోందని, అప్రమత్తంగా ఉండాలని అమెరికా రష్యాను గతంలోనే హెచ్చరించింది. దీనిని నిజం చేస్తూ తాజాగా రష్యా రాజధాని మాస్కోలో భీకర ఉగ్రదాడి యావత్ ప్రపంచం ఉలిక్కిపడేలా చేసింది. క్రాకస్ సిటీ కాన్సర్ట్ హాల్‌లోకి ముష్కరులు జరిపిన కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనంటూ ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది. మాస్కో ఘటనపై వైట్‌హౌస్ జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి అడ్రియెన్నీ వాట్సన్ స్పందించారు. మాస్కోలో ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్నట్టు దాదాపు నెల రోజుల క్రితం అమెరికా ప్రభుత్వానికి నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. కాన్సర్ట్‌లు, ప్రజలు ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలను లక్ష్యంగా ఈ దాడులు జరగొచ్చని తెలిసింది. దాంతో ఈ సమాచారాన్ని వాషింగ్టన్ వెంటనే రష్యా అధికారులతో పంచుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కొరియర్ అంటూ ఇంట్లోకి చొరబడిన దొంగలను చితగ్గొట్టిన తల్లీకూతుళ్లు
ఇస్రో రాకెట్ ‘పుష్పక్’ ప్రయోగం విజయవంతం
కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న వంతెన.. ఒకరు మృతి