ఏ వయసు వారు రోజూ ఎంత దూరం వాకింగ్ చేయాలి
అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు. అంటే అతి ఎప్పుడూ అనర్ధాలకు దారితీస్తుంది. ఏదైనా ఎంతవరకూ అవసరమో అంతే వరకూ ఉపయోగించాలి. అది మాటైనా వస్తువైనా.. మరేదైనా. ప్రస్తుత కాలంలో టెక్నాలజీ బాగా పెరిగింది. ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి నిద్రపోయేవరకూ టెక్నాలజీ ఆధారంగానే మనిషి జీవనవిధానం సాగుతోంది.
రోజుకో కొత్త టెక్నాలజీ పుట్టుకొస్తూ మనిషికి శారీరక శ్రమను పూర్తిగా తగ్గించేస్తోంది. కూర్చున్న చోటు నుంచి కదలకుండానే అన్నీ వచ్చి కళ్లముందు ప్రత్యక్షమవుతున్నాయి. దీంతో మనుషులకు శారీరక శ్రమ లేకపోవడంతో అనేక వ్యాధులబారిన పడుతున్నారు. ఈ క్రమంలో శరీరానికి వ్యాయామం తప్పనిసరి అయింది. అయితే వ్యాయామాలన్నిటిలోనూ చాలా సులభమైంది.. కీలకమైనది వాకింగ్. ఏ వయసువారు ఎంత సేపు, ఎలా వాకింగ్ చేయాలో చూద్దాం. ఇటీవలి కాలంలో శరీరానికి తగినంత వ్యాయామం లేకపోవడంతో షుగర్, బీపీ, ఊబకాయం వంటి జీవనశైలి వ్యాధులు కమ్ముకుంటున్నాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch: