Telangana: పతాకస్థాయికి చేరిన తెలంగాణ ప్రచారం.. ఆఖరిలో ఢిల్లీ అగ్రనేతలంతా రాష్ట్రానికి క్యూ..
Weekend Hour On Telangana Elections Campaign Live Video 25112023

Telangana: పతాకస్థాయికి చేరిన తెలంగాణ ప్రచారం.. ఆఖరిలో ఢిల్లీ అగ్రనేతలంతా రాష్ట్రానికి క్యూ..

Edited By: Ravi Kiran

Updated on: Nov 25, 2023 | 7:07 PM

తెలంగాణలో ప్రచారం పతాకస్థాయికి చేరింది. పల్లెలు, పట్నాలు జెండాలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి అగ్రనేతలు గల్లీలకు క్యూ కట్టారు. హస్తం పార్టీలో అగ్రనేతలుగా ఉన్న రాహుల్‌, ప్రియాంకలు రాష్ట్రమంతా పర్యటిస్తూ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. అటు బీజేపీలో టాప్‌ 5 లీడర్స్‌ కూడా తెలంగాణలోనే మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్‌ సహా కేంద్ర మంత్రులు బహిరంగసభల్లో పాల్గొన్నారు.

తెలంగాణలో ప్రచారం పతాకస్థాయికి చేరింది. పల్లెలు, పట్నాలు జెండాలు, నినాదాలతో హోరెత్తుతున్నాయి. ఢిల్లీ నుంచి అగ్రనేతలు గల్లీలకు క్యూ కట్టారు. హస్తం పార్టీలో అగ్రనేతలుగా ఉన్న రాహుల్‌, ప్రియాంకలు రాష్ట్రమంతా పర్యటిస్తూ కేడర్‌లో ఉత్సాహం నింపుతున్నారు. అటు బీజేపీలో టాప్‌ 5 లీడర్స్‌ కూడా తెలంగాణలోనే మకాం వేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, యూపీ సీఎం యోగి ఆధిత్యానాథ్‌ సహా కేంద్ర మంత్రులు బహిరంగసభల్లో పాల్గొన్నారు. ఇంకా మూడురోజులే ప్రచారానికి సమయం ఉండటంతో నేతలంతా కొత్త కొత్త అంశాలను తెరమీదకు తీసుకొస్తూ ప్రజల్లో చర్చ పెడుతున్నారు. ఇందులో పీవీ సెంటిమెంట్‌ ఉంది, సమైక్యవాదంపై రచ్చ జరుగుతోంది. నిరుద్యోగం అజెండాగా పెడుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 25, 2023 07:05 PM