ఆహార ప్రియులకు గుడ్ న్యూస్ !! దేశంలో ఎక్కడి ఫుడ్ అయినా ఆర్డర్‌ చేయొచ్చు !!

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఫేమస్ ఫుడ్ ను ఆర్డర్ చేసుకుంటే నిర్ణీత సమయంలో డెలీవరీ చేసే అదిరిపోయే ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది జొమాటో.

ఆహార ప్రియులకు గుడ్ న్యూస్ !! దేశంలో ఎక్కడి ఫుడ్ అయినా ఆర్డర్‌ చేయొచ్చు !!

|

Updated on: Sep 05, 2022 | 9:01 PM

దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఫేమస్ ఫుడ్ ను ఆర్డర్ చేసుకుంటే నిర్ణీత సమయంలో డెలీవరీ చేసే అదిరిపోయే ఆప్షన్ ను అందుబాటులోకి తెచ్చింది జొమాటో. జొమాటో తాజాగా ఇంటర్‌సిటీ లెజెండ్స్ అనే కొత్త డెలివరీ సర్వీసును పరిచయం చేయబోతుంది. దీని ద్వారా ఇతర నగరాల్లో ఫేమస్ రెస్టారెంట్ల నుంచి వంటకాలను ఆర్డర్ చేసుకునే వెసులుబాటును భోజన ప్రియులకు కల్పిస్తుంది. డెలివరీ కొన్ని సందర్భాల్లో ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయం పట్టవచ్చు. ఈ కొత్త సర్వీస్ ద్వారా కస్టమర్లు జైపూర్ నుంచి కచోరీ, కోల్‌కతా నుంచి కాల్చిన రోసోగొల్లాస్, హైదరాబాద్ నుంచి బిర్యానీ, బెంగళూరు నుంచి మైసూర్ పాక్, లక్నో నుంచి కబాబ్‌లు, ఓల్డ్ ఢిల్లీ నుంచి బటర్ చికెన్ ఇలా ఆయా ప్రాంతాల్లో ఫేమస్ వంటకాలను ఆర్డర్ చేసి ఆస్వాధించడానికి వెసులుబాటు కల్పించనుంది. ప్రస్తుతం ఈ జాబితాలో కోల్‌కతా, హైదరాబాద్, లఖ్నో, జైపూర్, బెంగళూరు, మధుర, చెన్నై, ఆగ్రా, భువనేశ్వర్‌ నుంచి కస్టమర్లు ఇష్టమైన ఫుడ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు. సేవలు ప్రారంభమైన నగరాల్లో కేవలం ఎంపిక చేసిన కొన్నింటికే ఈ అవకాశాన్ని జొమాటో అందిస్తోంది. లఖ్నోలో కేవలం ఏడు రెస్టారెంట్లు మాత్రమే ఈసేవలు అందించే జాబితాలో ఉన్నాయి. ఇతర నగరాలకు ఆహారాన్ని విమానం ద్వారా పంపిస్తారు. రెస్టారెంట్ తాజాగా ఆహారాన్ని సిద్ధం చేసిన తరువాత.. సురక్షితంగా రవాణా చేసేందుకు రీయూజబుల్, ట్యాంపర్ ఫ్రూఫ్ కంటైనర్లలో ప్యాక్ చేస్తారు. ఆహారం చెడిపోకుండా ఉంచేందుకు అత్యాధునిక మొబైల్ శీతలీకరణ సాంకేతికతను వినియోగించనున్నారు. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపబోమని కంపెనీ వెల్లడించింది. కస్టమర్లు ఆహారాన్ని అందుకున్న తరువాత మైక్రోవేవ్, ఎయిర్-ఫ్రై లేదా పాన్-ఫ్రై వినియోగించి హాట్ గా సర్వ్ చేసుకోవచ్చని కంపెనీ వెల్లడించింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూ.2లక్షలతో మొదలై రూ.75కోట్లకు ఎదిగిన ముగ్గురు మిత్రులు !!

పెళ్లి మండపంలో తండ్రిని చితకబాదిన కన్న పిల్లలు !! ఎందుకో తెలిస్తే షాకే

Viral Video: పులికే చుక్కలు చూపించిన ఎద్దు.. మామూలుగా లేదుగా !!

తలుపులకు శిలువ గుర్తులు !! దెయ్యం భయంలో ఆ గ్రామస్థులు

సైలెంట్‏గా పని కానిచ్చేశారు !! ఏం దొంగిలించారో తెలిస్తే షాక్‌ !!

Follow us