తలుపులకు శిలువ గుర్తులు !! దెయ్యం భయంలో ఆ గ్రామస్థులు
మెక్సికోలో కోకోయోక్ పట్టణంలో దెయ్యం తిరుగుతుందనే ప్రచారం మొదలైంది. రాత్రి పది తర్వాత ఆ ప్రాంతంలో వింత శబ్దాలు వస్తున్నాయని..
మెక్సికోలో కోకోయోక్ పట్టణంలో దెయ్యం తిరుగుతుందనే ప్రచారం మొదలైంది. రాత్రి పది తర్వాత ఆ ప్రాంతంలో వింత శబ్దాలు వస్తున్నాయని..అక్కడి వీధుల్లో ఆత్మలు తిరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. దీంతో స్థానికులు రాత్రి వేళల్లో బయటకు రావడానికి వణికిపోతున్నారు. ఈ పట్టణంలో ఎక్కువగా నహువా తెగకు చెందిన ప్రజలు ఉంటుంటారు. వారికి అతీంద్రియ శక్తులపైన, క్షుద్రప్రయోగాలపైన నమ్మకాలు ఎక్కువ. గత కొద్దిరోజులుగా రాత్రి వేళల్లో ఎక్కువగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయని.. అక్కడి వీధుల్లో ఆత్మలు తిరుగుతున్నాయని ప్రచారం ఎక్కువ కావడంతో.. అక్కడి ప్రజలు తమ ఇళ్ల తలుపులకు శిలువ గుర్తులు కూడా వేయించుకున్నారట. అయినప్పటికీ ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు భయపడిపోతున్నారు. శిలువలు ప్రధానంగా బ్యూనస్ ఎయిర్స్ స్ట్రీట్‌లోని ఇళ్లపై కనిపించాయి. మెక్సికోలో కేవలం ఈ ఒక్క పట్టణం మాత్రమే కాదు.. శాన్ లూయిస్ పోటోసిలో అనే ఓ చిన్న పట్టణం దెయ్యం భయానికి నిర్మాణుష్యంగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో

