వెంటపడి వెకిలి చేష్టలతో వేధించిన యువకులు.. తాట తీసిన శివంగి
జనగామ జిల్లా కేంద్రంలో ఓ యువతి శివమెత్తింది. తనను వేధిస్తున్న ఆకతాయిలకు తగిన బుద్ధి చెప్పింది. వారి వేధింపులు భరిస్తూ వచ్చిన యువతి చాకచక్యంగా వారిని పట్టుకుని దేహశుద్ధి చేసింది. వారిని వెంటపడి మరీ, ఎడాపెడా వాయించింది. ఈ ఘటన జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద జరిగింది.
గానుగుపహాడ్ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రెండు రోజుల నుండి ఓ యువతి వెంటపడి వేధిస్తున్నారు. చిరు వ్యాపారం చేసుకునే ఆ యువతి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. మాటలతో, వెకిలి చేష్టలతో వేధించారు. దీంతో విసిగిపోయిన ఆ యువతి వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. కానీ చిక్కకపోవడంతో మాట్లాడదాం రమ్మంటూ మధ్యవర్తులతో పిలిపించింది. బతుకమ్మ కుంట వద్దకు చేరుకోగానే ఆ యువతితో సహా కుటుంబ సభ్యులు కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో ఊగిపోయారు. వాళ్లను పట్టుకుని ఎడా పెడా వాయించారు. దేహశుద్ధి చేశారు. చివరికి జరిగిన దానికి క్షమాపణ చెప్పడంతో శాంతించిన యువతి కుటుంబసభ్యులు వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. దాంతో బతుకు జీవుడా అంటూ యువకులు వెళ్లిపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బ్యారేజ్‌పై కదులుతూ కనిపించిన నల్లటి ఆకారం.. వెళ్లి చూశాక షాక్ !!
Loading...
Unable to load recommendations.
Follow Us