Guinness World Records: వారెవా.. చప్పట్లతో గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌..

Updated on: Nov 10, 2022 | 8:33 AM

ప్రపంచ రికార్డు సృష్టించడం అంత తేలికైన విషయం కాదు. దీని కోసం చాలా కష్టపడాలి. మనం ఇప్పటివరకూ చాలా రకాల ప్రపంచ రికార్డుల గురించి విన్నాం.

ప్రపంచ రికార్డు సృష్టించడం అంత తేలికైన విషయం కాదు. దీని కోసం చాలా కష్టపడాలి. మనం ఇప్పటివరకూ చాలా రకాల ప్రపంచ రికార్డుల గురించి విన్నాం. కానీ చప్పట్లు కొట్టడం ద్వారా కూడా ఒక ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించవచ్చని మీకు తెలుసా? అవును, అలాంటి రికార్డు అమెరికాకు చెందిన ఓ యువకుడు సాధించాడు. ఒక నిమిషంలో మీరు ఎన్నిసార్లు చప్పట్లు కొట్టగలరు? మహా అంటే 10 నుంచి 20 సార్లు కొడతారు. కానీ 20 ఏళ్ల కుర్రాడు ఒక్క నిమిషంలో మొత్తం 1140 సార్లు చప్పట్లు కొట్టాడు. డాల్టన్ మేయర్ అనే ఈ యువకుడు కేవలం ఒక సెకనులో 19 సార్లు చప్పట్లు కొట్టాడు .. అలా ఒక నిమిషంలో చప్పట్లు కొట్టి.. తన పేరును గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. ప్రస్తుతం నిమిషంలో ఎక్కువ సార్లు చప్పట్లు కొట్టిన వ్యక్తిగా ప్రపంచ ఖ్యాతిగాంచాడు. మీడియా నివేదికల ప్రకారం, డాల్టన్ మేయర్ ఈ రికార్డ్ ను సృష్టించడానికి మణికట్టుతో చప్పట్లు కొట్టే పద్ధతిని ఉపయోగించాడు. ఈ టెక్నిక్‌లో మణికట్టు, వేళ్లను ఉపయోగించి చప్పట్లు కొట్టాడు. డాల్టన్ మేయర్ మార్చి నెలలోనే ఈ ప్రత్యేకమైన ప్రపంచ రికార్డును సృష్టించారు, అయితే ఈ రికార్డు అక్టోబర్ 31 వరకు ఆమోదించబడలేదు. అయితే, ఇప్పుడు ఈ రికార్డు అధికారికంగా ఆమోదించబడింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బయటపడిన అత్యంత అరుదైన మరకతం !! ఏకంగా కిలోన్నర !!

సూర్యుడికంటే 10 రెట్లు పెద్దదైన బ్లాక్‌ హోల్‌.. భూమికి అతి దగ్గరగా..

తమ్ముడి మాటలకు.. అన్నకు కన్నీళ్లు ఆగేలదు !!

Rashmika Mandanna: సోషల్‌ మీడియా ట్రోల్స్‌పై .. రష్మిక ఎమోషనల్‌ పోస్ట్‌

HIT 2: ‘ఉరికే ఉరికే’ సాంగ్‌.. లిప్‌ లాక్‌తో రెచ్చిపోయిన అడివి శేష్‌

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us