Youngman dance: ఈ యువకుడు డాన్స్ ఎక్కడ చేశాడో చూస్తే షాకవుతారు..! వండర్‌ఫుల్ అంటూ నెటిజన్లు కామెంట్స్..
ట్రెడ్ మిల్ అంటే తెలుసుగా.. ట్రెడ్‌మిల్‌పైన వర్కౌట్స్ చేయాలనుకునేవారికి దీనిపైన చాలా అవగాహన ఉండాలి. మెషిన్ గురించి ఏ మాత్రం తెలియకుండా ప్రయోగాలు చేయకూడదు. అలాంటి ట్రెడ్‌మిల్‌పై ఏకంగా ఓ వ్యక్తి డ్యాన్స్ చేశాడు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ యువకుడు ట్రెడ్‌మిల్‌పైన స్టెప్పులేసాడు. బాలీవుడ్ చిత్రం ‘కబి ఖుషి కబి ఘమ్’ లోని ‘బోలే చుదియన్..’ పాట లిరిక్స్‌కి తగ్గట్టుగా తనదైన స్టెప్పులతో అదరగొట్టాడు. ఏమాత్రం తడబడకుండా ఎంతో సునాయాసంగా డ్యాన్స్ చేసి అందరినీ ఆకట్టుకున్నాడు. అలోక్ అనే ఈ యువకుడు ట్రెడ్‌మిల్‌పై డ్యాన్స్ చెయ్యడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా చాలా సార్లు పలు బాలీవుడ్ పాటలకు తనదైన స్టైల్లో స్టెప్పులేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలను సైతం ఎప్పటికప్పుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తుంటాడు. తాజాగా ట్రెడ్‌మిల్‌పైన అతడు చేసిన ‘బోలే చుదియన్..’ డ్యాన్స్ వీడియో నెట్టింట దూసుకుపోతోంది. వీడియో చూసిన వేలాదిమంది నెటిజన్లు వండర్‌ఫుల్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
woman death: “సమాధిలోకి వెళుతున్నా..చనిపోబోతున్నా..” అంటూ బామ్మ కలకలం..వీడియో
Woman paraded: దొంగ అరాచకం.. మహిళను వీధుల్లో నగ్నంగా తిప్పాడు.. నెట్టింట హల్ చల్ చేస్తున్న వీడియో.
