Madhira: యముడు లీవ్‌లో ఉన్నట్లున్నాడు.. జస్ట్ మిస్.. ఈ వీడియో చూస్తే స్టన్ అవుతారు

|

Jan 29, 2024 | 12:49 PM

ప్రమాదం ఎలాంటిదైనా.. ప్రాణాలు రిస్క్‌లో పడ్డట్టే. కుటుంబాలు రోడ్డు పడ్డట్లే. అందుకే రోడ్డుపై వాహనాలు నడిచేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అన్ని వైపులా చూసుకోవాలని పోలీసులు చెబుతుంటారు. తాజాగా బోనకల్ మండలలోని కలకోట గ్రామంలో పెను ప్రమాదం తప్పింది.

రోడ్లపై తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒక్కోసారి తమ తప్పిదం వల్ల ప్రమాదం జరిగితే, ఒక్కోసారి ఇతరుల అలసత్వం వల్ల యాక్సిడెంట్స్ సంభవిస్తాయి. ఇక ప్రమాదం ఎలాంటిదైనా.. ప్రాణాలు రిస్క్‌లో పడ్డట్టే. కుటుంబాలు రోడ్డు పడ్డట్లే. అందుకే రోడ్డుపై వాహనాలు నడిచేటప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలని, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అన్ని వైపులా చూసుకోవాలని పోలీసులు చెబుతుంటారు. తాజాగా బోనకల్ మండలంలోని కలకోట గ్రామంలో పెను ప్రమాదం తప్పింది. గత గురువారం మధ్యాహ్నం ఈ ఘటన జరగగా.. దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.

ఖమ్మం జిల్లా మధిర నుంచి వైరా వైపు వస్తున్న ఓ కారు..  బైక్‌పై రోడ్డు క్రాస్ చేస్తున్న ఓ యువకుడిని ఢికొట్టింది. క్షణాల వ్యవధిలో బైక్ ముందుకు వెళ్లడం, కార్ డ్రైవర్ వెంటనే బ్రేక్ వేయడంతో యువకుడికి స్పల్ప గాయాలతో బయటపడ్డాడు. అత్యంత వేగంగా వచ్చిన కారు.. రోడ్డు దాటుతున్న బైక్‌ను ఢికొట్టి మెరుపు వేగంతో దూసుకెళ్లింది. ఈ ఘటనలో అటు కారు అతి వేగంతో పాటు… ఇటు బైక్ నడుపుతున్న వ్యక్తి నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Jan 29, 2024 12:48 PM