స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు.. రూ.20 నోటుతో దేవుడికి ‘సుపారీ’

Updated on: Jun 23, 2026 | 8:46 PM

అనంతపురం జిల్లాలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా ఓ రూ.20 నోటుపై రాసిన వింత కోరిక అందరినీ ఆశ్చర్యపరిచింది. అత్త వేధింపులు భరించలేక ఆమె త్వరగా చనిపోవాలని స్వామివారిని కోరుతూ ఓ మహిళ ఆ నోటును హుండీలో సమర్పించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారి చర్చనీయాంశమైంది.

దేవుడి గుడికి వెళ్తే సాధారణంగా స్వామీ నాకు ఆస్తులివ్వు..బంగారం ఇవ్వు.. లేదంటే మంచి ఉద్యోగం ఇవ్వు అని కోరుకుంటారు.. మొక్కులు చెల్లిస్తారు. కానీ అనంతపురం జిల్లాలో ఓ మహిళ విచిత్రమైన కోరిక కోరుతూ స్వామివారి హుండీలో రూ.20లు సమర్పించింది. ఆలయ హుండీ లెక్కింపు సమయంలో బయటపడిన ఆ నోటు చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. భక్తులు ఇలాంటి కోరికలు కూడా కోరతారా అంటూ ముక్కున వేలేసుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. అనంతపురం జిల్లాలో ఓ భక్తురాలు ఆత్మకూరు మండలం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్లింది. అక్కడ స్వామివారికి మొక్కుకుని హుండీలో ఓ రూ.20లు స్వామివారికి సుపారీ ఇచ్చి తన అత్త చనిపోవాలంటూ కోరుకుంది. ఇటీవల ఆలయ అధికారులు హుండీ కానుకలను లెక్కిస్తుండగా ఒక రూ.20 నోటు కనిపించింది. దానిపై రాసి ఉన్న అక్షరాలను చూసి అధికారులు, భక్తులు ఒక్కసారిగా ముక్కున వేలేసుకున్నారు. ఆ నోటుపై.. “స్వామీ.. మా అత్త వేధింపులు తట్టుకోలేకపోతున్నాను. ఆమె త్వరగా చనిపోయేలా చూడు స్వామి” అని రాసి ఉంది. అత్త పెట్టే టార్చర్ భరించలేక సదరు కోడలు దేవుడి హుండీలో నోటు వేసి మరీ మొక్కుకున్నట్లు అర్థమవుతోంది. ఈ వింత కోరికను చూసి ఆలయ సిబ్బంది అవాక్కయ్యారు. ఈ న్యూస్ కాస్తా బయటపడటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “అత్తా-కోడళ్ల గొడవలను దేవుడు కూడా తీర్చలేక హుండీ పక్కన పెట్టేలా ఉన్నాడు” అని కొందరు, “కేవలం ఇరవై రూపాయలకే అత్తను లేపేయాలని దేవుడిని కోరడం టూ మచ్” అని మరికొందరు క్రేజీ కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఈ ‘రూ.20 నోటు’ వ్యవహారం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమెరికాలో గడ్డి కోస్తూ లక్షల్లో సంపాదన.. నెటిజన్ల రియాక్షన్‌ ఇదే!

నాలుగు షాపుల్లో చొరబడిన దొంగలు.. పాపం చివరికి దొరికింది ఇదే!

టీఆర్ ఫైలింగ్‌లో ‘క్లాడ్ ఏఐ’ హవా.. సీఏను మించిన అద్భుతమైన పని తీరు!

క్లాస్ 12 తర్వాత చదువు ఆపేయండి! సంచలనంగా వ్యాపారవేత్త కామెంట్

ఏఐ వల్ల ఈ ముప్పు కూడా ఉందా? ఆలోచించడం మానేస్తే ప్రమాదమంటున్న నిపుణులు

Follow Us