నడిరోడ్డుపై పూనకం వచ్చినట్టు ఊగిపోయిన మహిళ.. ఏం జరిగిందంటే ??

Updated on: Mar 28, 2022 | 9:54 AM

ఇంటర్నెట్ పుణ్యమా అని ఇటీవల ఎక్కడ ఏం జరిగినా సెకండ్లలో అందరికీ తెలిసిపోతుంది. ప్రస్తుతం నెట్టింట చీర కట్టులో ఉన్న ఓ మహిళ ప్రపంచాన్ని మర్చిపోయి డ్యాన్స్‌ చేసే వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

ఇంటర్నెట్ పుణ్యమా అని ఇటీవల ఎక్కడ ఏం జరిగినా సెకండ్లలో అందరికీ తెలిసిపోతుంది. ప్రస్తుతం నెట్టింట చీర కట్టులో ఉన్న ఓ మహిళ ప్రపంచాన్ని మర్చిపోయి డ్యాన్స్‌ చేసే వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఐతే అది పట్టరాని ఆనందమో, అంతులేని విషాదమో.. మద్యం నిషానో తెలియదు కానీ పూనకం వచ్చినట్లు డ్యాన్స్‌ చేస్తున్న ఈ మహిళకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియా లో విపరీతంగా షేర్‌ అవుతోంది. చుట్టూ ఉన్న వాళ్లు ఆమె ఎందుకు అలా డాన్స్‌చేస్తుందో అర్థం కాకపోయినా.. ఆసక్తిగా చూస్తుండిపోయారు. మరో మహిళ ఆమెతో కాలు కలిపేందుకు ప్రయత్నించింది. మరి కొందరేమో వారి మొబైల్స్‌కి పని చెప్పారు. ఆమె డాన్స్‌ మొత్తం వీడియో తీసారు. డ్యాన్స్‌ ఆపమని కుటుంబ సభ్యులు వారిస్తున్నా వినిపించుకోకుండా ఇష్టం వచ్చినట్లు గంతులు వేస్తూనే ఉంది ఆ మహిళ. చుట్టూ ఉన్న పరిసరాలను చూస్తుంటే అదొక గ్రామంలా ఉంది. ఈ సంఘటన ఎక్కడ చోటుచేసుకుందో తెలియదు కానీ ‘ఘంఠా’ అనే యూజర్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసారు.

Also Watch:

Viral Video: పాపం గురుడు !! అలా ట్రై చేసి బొక్కబోర్లా పడ్డాడు !!

హలీమ్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. రంజాన్‌కు ముందే సరికొత్త టెస్ట్‌తో !!

స్నేహితుడి పెళ్లికి అదిరిపోయే గిఫ్ట్ !! మేళతాలాలతో‏ ఊరేగింపుగా తీసుకెళ్లి మరీ ఇచ్చారు..

అదృష్టవంతురాలు.. లారీని ఢీకొట్టినా, అది కాపాడింది !!