బుర్ఖాలో పూస‌లుగా కుట్టి బంగారం స్మగ్లింగ్‌.. వీడియో

|

Mar 10, 2022 | 8:20 AM

బంగారాన్ని బిస్కెట్ల రూపంలో లేదంటే షూలో, బ్యాగుల్లో, బ‌ట్ట‌ల్లో, అండ‌ర్‌వేర్‌లో దాచుకొని తీసుకెళ్తూ క‌స్ట‌మ్స్ అధికారుల త‌నిఖీల‌లో ప‌ట్టుబ‌డుతుంటారు.

బంగారాన్ని బిస్కెట్ల రూపంలో లేదంటే షూలో, బ్యాగుల్లో, బ‌ట్ట‌ల్లో, అండ‌ర్‌వేర్‌లో దాచుకొని తీసుకెళ్తూ క‌స్ట‌మ్స్ అధికారుల త‌నిఖీల‌లో ప‌ట్టుబ‌డుతుంటారు. కానీ ఓ మ‌హిళ మాత్రం 18 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన బంగారు పూస‌ల‌ను బుర్ఖాకు ఉన్న డిజైన్‌లో పెట్టి కుట్టి స్మ‌గ్లింగ్ చేయ‌బోయి హైద‌రాబాద్ ఎయిర్‌పోర్ట్‌ క‌స్ట‌మ్స్ అధికారుల‌కు దొరికిపోయింది. దుబాయ్ నుంచి హైద‌రాబాద్‌కు వ‌చ్చిన ఓ విమానంలో ఓ మ‌హిళ బుర్ఖా ద్వారా బంగారాన్ని త‌ర‌లించాలని చూసింది. డిజైన్ నుంచి వేరు చేసి గోల్డ్‌ను లెక్కించ‌గా.. అది 350 గ్రాములుగా ఉంది. దాని విలువ 18.18 ల‌క్షలుంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. ఆ మ‌హిళ మీద కేసు న‌మోదు చేసి విచార‌ణ ప్రారంభించారు.

Also Watch:

Viral Video: వేదికపైనే తన్నుకున్న వధూవరులు !! వీడియో

క్రికెట్‌లో కొత్త రూల్స్‌.. ఆ పని చేస్తే మూల్యం తప్పదు.. వీడియో

విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్.. 18 ఏళ్ళ వివాహ బంధానికి ముగింపు !! వీడియో

AP Movie Ticket Rates Fixed : థియేటర్ రేట్లు పెంచాం.. కాని కండీషన్ అప్లై !! వీడియో

Viral Video: నెమలి-మేక మధ్య హోరాహోరి పోరు !! వీడియో