పెళ్లి దుస్తుల్లో పరుగులు పెట్టిన యువతి..కిలో మీటర్ల కొద్దీ పరుగు.ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు.:Woman runs in wedding dress video.

|

Jul 02, 2021 | 12:00 PM

Woman runs in wedding dress :కొంతమంది తమకు అన్యాయం జరిగితే లోలోపల కుమిలిపోతారు. కొందరు ఎదురు తిరిగి యుద్ధం చేస్తారు. చాలా తక్కువమంది మాత్రమే తనలా ఎవరూ బాధపడకూడదని ఆలోచిస్తారు. దానికోసం ఎదో ఒక కార్యక్రమం చేసి తనలాంటి వారిలో అవగాహన పెంచుతారు.


సాధారణంగా మహిళల పై వేధింపులు అదీ వివాహితలపై జరిగే గృహహింస మన దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువే. ఎక్కడిక్కడ చట్టాలు ఉన్నా.. ఈ వేధింపులను ఆపడం ఎవరితరమూ కాదు. కొంతమంది మహిళలు అవగాహన లేక ఈ గృహహింసలను భరిస్తూ కాలం వెళ్ళదీస్తారు. ఆమె 47 ఏళ్ల వెనెస్సా రేసర్. న్యూయార్క్‌లోని రాక్‌ల్యాండ్‌లో నివసిస్తున్న సైకోథెరపిస్ట్. ఈమె పెళ్లి కుమార్తె దుస్తులు ధరించి రోడ్డు మీద పరుగులు తీయడం మొదలు పెట్టింది. అది చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆమె ఊరికే పనిలేక అలా పరుగులు తీయలేదు. ఎందుకు తాను ఈపని చేస్తోందో ఇలా వివరించింది..”నేనే గృహ హింసకు గురయ్యాను. ఈ సమస్యను ఎదుర్కొంటున్న చాలా మంది నా వద్దకు వస్తారు. నాకు తెల్సి చాలామందికి ఈ సమస్యపై సరైన అవగాహనే లేదు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రయత్నించే వారు ఎవరూ నాకిప్పటివరకూ కనిపించలేదు. అందుకే.. నేను ప్రజల్లో అవగాహన కల్పించేలా ఎదోఒకటి చేయాలని అనుకున్నాను. అందుకే ఈ పరుగు మొదలు పెట్టాను. గృహ హింసకు వ్యతిరేకంగా మహిళలు తమ గొంతు విప్పడానికి ఇది ఒక స్ఫూర్తి కావాలని నా ప్రయత్నం.”
మరిన్ని ఇక్కడ చూడండి: రణ్‏వీర్ సింగ్ న్యూలుక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నా ఫోటోలు ,వీడియో :Ranveer Singh new Look video.

నయనతార కంటే విఘ్నేష్‌ శివన్‌ ఎంత చిన్నవాడో తెలుసా..?సెలబ్రిటీ పర్సనల్‌ లీక్స్ :Nayantara Vignesh Shivan video.

సెకండ్ ఇన్నింగ్స్ లో కలర్స్ స్వాతి దుకుడు..కార్తికేయ సినిమాకు సీక్వెల్ నిఖిల్ తో మరోసారి చలాకీ పిల్ల:Colors Swathi Reentry video.

12 ఏళ్లకే చెస్ లో గ్రాండ్ మాస్టర్ ఎవరా ఆ బుడ్డోడు..?అతి చిన్న వయసులోనే గుర్తింపు..:Abhimanyu Mishra Video.

Follow us on