పెళ్లింట విషాదం.. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన యువతి

|

Feb 09, 2025 | 11:14 PM

మధ్యప్రదేశ్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ అందరినీ అలరించిన ఓ యువతి కాసేటికే విగత జీవిగా మారింది. స్టేజ్‌పై డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె కన్నుమూసినట్లు వైద్యులు నిర్ధారించారు.

మధ్యప్రదేశ్‌లో విదిష జిల్లాలోని ఓ పెళ్లి వేడుకలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లి వేడుకలో స్టేజ్‌పై ఓ యువతి డ్యాన్స్‌ చేస్తూ గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయింది. బంధువులు ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. వధువుకు చెల్లి అయిన ఆ యువతి హఠాన్మరణంతో పెళ్లింట విషాదం నెలకొంది. పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఆ యువతి పరిణీత జైన్ ఇండోర్ నుంచి వచ్చినట్లు కుటుంబీకులు తెలిపారు. డ్యాన్స్ చేస్తుండగా గుండెపోటుకు గురికావడంతో ఆమె మృతి చెందినట్లు భావిస్తున్నారు. యువతి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన దృశ్యాలు కెమరాలో రికార్డు కావడంతో ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.