Viral Video: భర్తకు దగ్గరుండి మూడో వివాహం చేసిన ఇద్దరు భార్యలు

Updated on: Jul 06, 2024 | 12:20 PM

ఇద్దరు భార్యలు ఉండగా మరో మహిళపై మనసు పారేసుకున్న వ్యక్తికి అతని ఇద్దరు భార్యలు దగ్గరుండి మరీ మూడో వివాహం జరిపించారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. సాగేని పండన్న అనే గిరిజన రైతు 2001లో అప్పలమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగి నాలుగేళ్లయినా ఆమెకు సంతానం కలగలేదు. దీంతో భార్యాభర్తలిద్దరూ మానసిక వేదనకు గురయ్యారు. దీంతో భర్తకు మరో వివాహం చేయాలనుకుంది అప్పలమ్మ.

ఇద్దరు భార్యలు ఉండగా మరో మహిళపై మనసు పారేసుకున్న వ్యక్తికి అతని ఇద్దరు భార్యలు దగ్గరుండి మరీ మూడో వివాహం జరిపించారు. అల్లూరి జిల్లా ఏజెన్సీలో జరిగిన ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. సాగేని పండన్న అనే గిరిజన రైతు 2001లో అప్పలమ్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగి నాలుగేళ్లయినా ఆమెకు సంతానం కలగలేదు. దీంతో భార్యాభర్తలిద్దరూ మానసిక వేదనకు గురయ్యారు. దీంతో భర్తకు మరో వివాహం చేయాలనుకుంది అప్పలమ్మ. 2005లో పార్వతమ్మ అనే మహిళతో పండన్నకు అప్పలమ్మ దగ్గరుండి వివాహం జరిపించింది. ఈ క్రమంలో పార్వతమ్మకు బాబు పుట్టాడు. ఇద్దరు భార్యలు, బాబు తో పండన్న కాపురం సాఫీగా సాగింది. అయితే.. మరో సంతానం కోసం ప్రయత్నించినప్పటికీ.. కలగలేదు. దాదాపు 17 ఏళ్లు వేచి చూశారు. అప్పటికీ రెండో సంతానయోగం కలగకపోవడంతో.. అప్పలమ్మ, పార్వతమ్మ కలిసి.. పండన్నకు మరో పెళ్లి చేయాలని నిర్ణయించారు. తమ భర్త ఆనందంలో తమ సంతోషం చూసుకునే ఆ ఇద్దరు భార్యలు పండన్నను ప్రోత్సహించారు. అందుకు తమ బంధువైన లక్ష్మీ అలియాస్ లావ్యను ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దల ద్వారా సంబంధం కుదిర్చారు. పండన్న ఆ ఇద్దరు భార్యలతో ఉన్న అన్యోన్యత, పండన్న మనస్తత్వాన్ని గుర్తించి లావణ్య కుటుంబ సభ్యులు కూడా అంగీకరించడంతో ఇక పెళ్లికి అంగీకరించారు లావ్య కుటుంబసభ్యులు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈమే.. సంతాన లక్ష్మి !! ఒకే ఈతలో ఏకంగా కబడ్డీ జట్టునే కనేసింది

కంగనాను కొట్టిన CISF కానిస్టేబుల్‏కు ఊహించని షాక్..

Balakrishna: హీరోయిన్ రిసెప్షన్.. బాలయ్య ఫన్నీ మూమెంట్

Manamey: OTT స్ట్రీమింగ్‌కు సిద్దమైన మనమే !! ఎప్పుడంటే ??

Maharaja: గుడ్ న్యూస్ OTTలోకి వచ్చేస్తోన్న మహరాజా…

Loading...
Unable to load recommendations.
Follow Us