భర్త కళ్లలో కారం కొట్టి హత్య.. కారణం ఇదే
ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులే బంధాలను మరిచి మర్డర్‌లు చేస్తున్నారు. అక్రమ సంబంధాలకు అడ్డు వస్తున్నారని కొందరు, మద్యం సేవించి వచ్చి గొడవ చేస్తున్నారని కొందరు.. ఇలా భార్యాభర్తలు ఒకరినొకరు చంపుకుంటున్నారు. పసిపిల్లలను సైతం పొట్టన పెట్టుకుంటూ కసాయివాళ్లుగా మారుతున్నారు. తాజాగా ఓ మహిళ.. భర్త వేధింపులు భరించలేక అతని కళ్లలో కారం చల్లి ఉరి బిగించి చంపేసింది.
ఆ తర్వాత ఘోరం జరిగిపోయిందని లబోదిబోమంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ మండలం కేసారంలోని ఓ వెంచర్‌లో కుమార్, రేణుక దంపతులు జీవనం సాగిస్తున్నారు. కుమార్ రోజూ మద్యం సేవించి వచ్చి రేణుకతో గొడవపడుతూ ఉండేవాడు. భర్త వేధింపులు రోజు రోజుకూ ఎక్కువడంతో రేణుక విసిగిపోయింది. ఎప్పటిలాగే ఆదివారం మద్యం సేవించి వచ్చిన కుమార్ భార్యతో గొడవకు దిగాడు. అప్పటికే భర్త వేధింపులతో విసిగిపోయి ఉన్న రేణుక భర్త కళ్లలో కారం చల్లి చీరతో అతని మెడకు ఉరి బిగించి హత్య చేసింది. భర్త చనిపోవడంతో కంగారుపడిన రేణుక క్షణికావేశంలో తప్పు చేశానంటూ బోరున ఏడ్చింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నల్గొండ కేతమ్మకు.. బంపర్ ఆఫర్ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
లోబోకు ఏడాది జైలు శిక్ష..! ఇద్దరి చావుకు కారణం..7 ఏళ్ల తర్వాత తీర్పు
భయానికే భయం పుట్టిస్తున్న హర్రర్ ఫిల్మ్.. అస్సలు మిస్ కావద్దు
ప్రభాస్ దెబ్బకు అరవ హీరో సైలెంట్ అవుతాడా ??
నా కొడుకు కాలు విరిగింది..! అంత బాధలోనూ నా జున్ను ఆ మాట అన్నాడు..