భర్త రూ.5ల కుర్‌ కురే తేలేదని విడాకుల వరకూ వెళ్ళిన దంపతులు

|

May 18, 2024 | 2:37 PM

ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన ఆహారం అంటే ఇష్టం ఉంటుంది. ఇటీవల బాగా అందుబాటులోకి వచ్చిన కుర్‌కురే అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరిచేతిలో చూసినా కుర్‌ కురే ప్యాకెట్‌ ఉండాల్సిందే. పిల్లలకే కాదు పెద్దలకు కుర్‌కురే అంటే ఇష్టంగా తింటారు. అలా ఓ మహిళకు కూడా ఈ కుర్‌కురే అంటే ప్రాణం. రోజూ వాటిని తిని తీరాల్సిందే. దాంతో భర్త కూడా రోజూ భార్యకు ఎంతో ఇష్టమైన రూ. 5 కుర్‌కురే ప్యాకెట్ తెచ్చి ఆమె కళ్లలో ఆనందం చూసి మురిసిపోయేవాడు.

ఒక్కొక్కరికీ ఒక్కోరకమైన ఆహారం అంటే ఇష్టం ఉంటుంది. ఇటీవల బాగా అందుబాటులోకి వచ్చిన కుర్‌కురే అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఎవరిచేతిలో చూసినా కుర్‌ కురే ప్యాకెట్‌ ఉండాల్సిందే. పిల్లలకే కాదు పెద్దలకు కుర్‌కురే అంటే ఇష్టంగా తింటారు. అలా ఓ మహిళకు కూడా ఈ కుర్‌కురే అంటే ప్రాణం. రోజూ వాటిని తిని తీరాల్సిందే. దాంతో భర్త కూడా రోజూ భార్యకు ఎంతో ఇష్టమైన రూ. 5 కుర్‌కురే ప్యాకెట్ తెచ్చి ఆమె కళ్లలో ఆనందం చూసి మురిసిపోయేవాడు. ఒకరోజు కుర్‌కురే తీసుకురావడం మర్చిపోయాడు పాపం.. వట్టి చేతులతో వచ్చిన భర్తను చూసిన భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడితో ఆగిందా…? ఏకంగా విడాకుల కోసం అప్లై చేసింది. కుర్‌కురే కూడా తీసుకురాలేని భర్తతో తాను కాపురం చేయలేనని తెగేసి చెప్పింది. దీంతో విస్తుపోవడం పోలీసుల వంతైంది.ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆగ్రా చెందిన వారిద్దరికీ ఏడాది క్రితమే వివాహమైంది. ఆమెకు రోజూ కుర్‌కురే తినడం అలవాటు. కొన్నాళ్లు భర్త కూడా ఎలాంటి అడ్డుచెప్పకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చి ఇచ్చేవాడు. అయితే, జంక్‌ఫుడ్ రోజూ తింటే ఆరోగ్యం పాడవుతుందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అది ఇరువురి మధ్య గొడవకు కారణమైంది. అయినప్పటికీ అదేమీ మనసులో పెట్టుకోకుండా రోజూ ఓ ప్యాకెట్ తెచ్చే భర్త.. ఒకరోజు మర్చిపోయాడు. అంతే, అపరకాళిలా అతడిపై విరుచుకుపడిన ఆమె, ఆపై పెట్టేబేడా సర్దుకుని పుట్టింటికి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి భర్త తనను కొడుతున్నాడని ఫిర్యాదు చేస్తూ విడాకులు ఇప్పించాలని కోరింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆవలింత వచ్చిందని పెద్దగా నోరు తెరిచిందంతే.. దవడ కాస్తా ??

ఒక్క మలుపు కూడా లేకుండా 256 కి.మీ హైవే

చనిపోయన పాముకు ఘనంగా అంతిమయాత్ర

AP: ఏపీలో దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు గని

ఈ సమయాల్లో టీ, కాఫీలు అస్సలు తాగొద్దు.. ఐసీఎమ్ఆర్ కీలక సూచన