బలపడిన వాయుగుండం.. ఏపీకి మరో వారం రోజులు వానలే.. తెలంగాణలో ఆ జిల్లాల్లో వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు ఆరు రోజుల పాటు వర్షాలు కరవనున్నాయి. ఈ నెల 18 నుంచి 23 వరకు ఏపీలో, 20 వరకు తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు, రైతులు, మత్స్య కారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఆరు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాను ఆనుకుని వాయువ్య బంగాళాఖాతంలో పయనిస్తోంది. దీని ప్రభావంతో ఏపీలో ఈ నెల 18వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని, ఈ నెల 20వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. రాజధాని హైదరాబాద్‌తో పాటు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది
మరిన్ని వీడియోల కోసం :
గ్లోబల్ బిజినెస్ లెక్కలు మార్చేస్తున్న రామాయణ టీమ్
ఫరియా అబ్దుల్లాను ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు