డబ్బుల కోసం యూట్యూబర్లు ఇలా కూడా చేస్తారా ??

|

Dec 11, 2024 | 9:12 PM

వరంగల్‌ పట్టణంలోని రంగంపేటలో దారుణహత్యకు గురైన రిటైర్డ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజమోహన్‌ హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ హత్యను సవాల్‌గా తీసుకున్న పోలీసులు నిందితున్ని పట్టుకున్నారు. ఇంట్లో మద్యం సేవించిన తర్వాత వరంగల్ వాసి ఈ హత్య చేసినట్లు తేలింది. సీసీ కెమెరాల సాయంతో హంతకుణ్ణి గుర్తించిన పోలీసులు..అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

హత్య చేసిన నిందితుడు యూట్యూబర్ గా గుర్తించారు. అప్పు ఇవ్వలేదన్న కోపంతో కిరాతకంగా హత్య చేశాడని పోలీసులు చెప్పారు. మృతుడి ఒంటిపై ఉన్న బంగారం దోచుకెళ్లాడు నిందితుడు. ఈ నెల 4వ తేదీన కాకతీయ గ్రామీణ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ రాజామోహన్ దారుణ హత్యకు గురయ్యాడు. కాళ్లు, చేతులను తాళ్లు, గొలుసులతో కట్టేసి.. అతికిరాతకంగా హత్య చేశారు . ఆ తర్వాత మృతదేహాన్ని కారు వెనక భాగంలో పెట్టి.. రంగంపేటలోనే పార్క్‌ చేసి పారిపోవడం వరంగల్‌ ప్రజల్ని ఉలిక్కి పడేలా చేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Bleeding Eye: కరోనా కంటే డేంజర్‌.. బ్లీడింగ్ ఐ వైరస్ !!

ఆలోచన అదిరిందిపో.. కుక్కల నుంచి రక్షణకు వినూత్న ప్రయోగం !!

జలుబు, దగ్గు, గొంతునొప్పికి ఇంటి చిట్కాలు

‘పుష్ప-2’ పై ట్రోల్స్.. గట్టిగా బదులిచ్చిన జాన్వీ కపూర్ !!

గూగుల్ మ్యాప్స్‌ను నమ్ముకుంటే క్రూరమృగాల తీసుకెళ్లింది !!