ఇక్కడ ఎంతటి కోటీశ్వరుడైనా అడుక్కోవాల్సిందే

|

Jan 25, 2024 | 6:43 PM

హిందూ సంప్రదాయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం పాటిస్తారు. దేవీ దేవతలను కొలిచే క్రమంలో ఆయా ప్రాంతాలను అనుసరించి సంప్రాదాయాలు, ఆచారాలు పాటిస్తారు. ఈ క్రమంలో కొన్ని ఆచారాలు వింతగా అనిపిస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ జాతరలో వింత ఆచారం పాటిస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గ్రామదేవత సత్తెమ్మతల్లి జాతరలో అడుక్కుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

హిందూ సంప్రదాయంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం పాటిస్తారు. దేవీ దేవతలను కొలిచే క్రమంలో ఆయా ప్రాంతాలను అనుసరించి సంప్రాదాయాలు, ఆచారాలు పాటిస్తారు. ఈ క్రమంలో కొన్ని ఆచారాలు వింతగా అనిపిస్తాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం సత్తెమ్మ జాతరలో వింత ఆచారం పాటిస్తారు. రెండు సంవత్సరాలకు ఒకసారి వచ్చే గ్రామదేవత సత్తెమ్మతల్లి జాతరలో అడుక్కుని మొక్కు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఎంతటి కోటీశ్వరుడైనా మొక్కుకుంటే అడుక్కోవాల్సిందే అంటున్నారు ఇక్కడి గ్రామస్తులు. సంతానం కోసం దంపతులు, వ్యాపార అభివృద్ధి కోసం వ్యాపారస్తులు, పాడి పంటలకోసం రైతులు అమ్మవారికి మొక్కుకుంటారు. తమ కోరిక నెరవేరిన అనంతరం అమ్మవారి జాతరలో తమ మొక్కులు తీర్చుకుంటారు. కొప్పవరం గ్రామం పాడిపంటలకు ప్రసిద్ధి. పూర్వం గ్రామ దేవత అయిన సత్తెమ్మ తల్లి తమ పంట పొలాలకు కాపలాగా ఉండేదని దొంగల బారి నుండి పంటను దొంగిలించకుండా కాపలా కాసేదని గ్రామస్తులు విశ్వసిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Hanuman: UP సీఎంను కదిలించిన ‘హనుమాన్’

Follow us on