Viral Video: వామ్మో.. నెటిజన్లను షేక్ చేస్తున్న నాగులు.. మూడు ఒకేచోట మీటింగ్.. ఎందుకో ఏమో..

Viral Video: పాములు కనిపిస్తే చాలు.. అవి ఏ జాతికి చెందినవి అయినా సరే భయపడతాం..  వెంటనే మనం అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం.. మరి అలాంటిది విష సర్పమైన నాగు పాము..

Viral Video: వామ్మో.. నెటిజన్లను షేక్ చేస్తున్న నాగులు.. మూడు ఒకేచోట మీటింగ్.. ఎందుకో ఏమో..
Three Snakes

Updated on: Dec 20, 2021 | 9:08 AM

Viral Video: పాములు కనిపిస్తే చాలు.. అవి ఏ జాతికి చెందినవి అయినా సరే భయపడతాం..  వెంటనే మనం అక్కడ నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాం.. మరి అలాంటిది విష సర్పమైన నాగు పాము కనిపిస్తే వెన్ను లోంచి వణుకు వస్తుంది.. ఇక పడగ విప్పితే చాలు.. పిటి ఉషాకు పోటీ ఇచ్చేలా పరుగులు పెడతాం.. అయితే అప్పుడప్పుడు రెండు పాములు కలిసి ఉన్న వీడియోలు తరచుగా చూస్తూనే ఉన్నాం.. ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు పాములు ఒకేసారి దర్శనం ఇచ్చాయి. ఈ వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియోలో మూడు నాగుపాములు అడవిలో రౌండ్ టేబుల్ సమావేశమయ్యాయి. మూడు పాములు పడగవిప్పి ఒకటి ముఖం మరొకటి చేసుకుంటున్నాయి. ఈ మూడు పాముల తీరు చూస్తే ట్రైయాంగిల్ లవ్ స్టోరీని తలపిస్తుందంటూ కామెంట్ చేస్తున్నారు కొందరు.. అయితే ఆ పాముల్లో ఒకటి బుసలు కొడుతూ కోపంగా చూస్తుంది. మూడు పాములు ప‌డ‌గ విప్పి.. ఏం చేస్తున్నాయి. ఏమైనా సీక్రెట్స్ మాట్లాడుకుంటున్నాయా.. లేక ప్రేమ నాకు సొంతం అంటే నాకు సొంతం అంటూ నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాముల సమావేశాన్ని ఎప్పుడు ఎక్కడ ఎవరు తీశారో తెలియదు.. అయితే వీడియో వైరల్ అవుతుంది. తెగ లైక్స్ ను సొంతం చేసుకుంటుంది.

 

Also Read:  ఫిలిప్పీన్స్​లో రాయ్‌ తుఫాను బీభత్సం.. 208 మంది మృతి.. లక్షలాది మంది నిరాశ్రయులు..

Loading...
Unable to load recommendations.
Follow Us