రామకృష్ణను చంపిన భార్య.. KPHBలో దారుణం వీడియో

Updated on: Aug 31, 2025 | 3:22 PM

ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలతో కొందరు తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. చాలీ చాలని సంపాదనతో కుటుంబాన్ని పోషించలేక నానా ఇబ్బందులుపడుతున్నారు. మరికొందరు ఆర్ధిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే హైదరాబాద్‌ కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డ్‌లో జరిగింది. అప్పుల బాధ భరించలేక ఓ జంట ఆత్మహత్య చేసుకుంది.

పోలీసుల వివరాలు ప్రకారం… రామకృష్ణ, రమ్యకృష్ణ దంపతులు కొంతకాలంగా కూకట్‌పల్లి హౌసింగ్‌ బోర్డులో నివాసం ఉంటున్నారు. కుటుంబ సమస్యల వల్లనో మరో కారణం చేతనో అప్పల పాలయ్యారు. చాలీచాలని సంపాదనతో అప్పులు తీర్చే మార్గం కనిపించలేదు. మరోవైపు అప్పు ఇచ్చిన వాళ్ల ఒత్తిడి బాగా పెరిగిపోయింది. అప్పు చెల్లించే మార్గం కనబడక భార్యభర్తలిద్దరూ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు. అప్పుల వాళ్ల బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో భార్య రమ్యకృష్ణ ముందుగా భర్తను హతమార్చింది. కూరగాయలు కోసే కత్తితో భర్త గొంతుకోసిన రమ్యకృష్ణ ఆ తర్వాత తాను కూడా గొంతుకోసుకొని ప్రాణాలు విడిచింది. అప్పులవాళ్ల ఒత్తిడితో ప్రాణాలు తీసుకున్న భార్యభర్తలు రక్తపు మడుగులో పడి ఉండటం గమనించిన చుట్టుపక్కల వారు.. పోలీసులకు సమాచారమిచ్చి ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే రామకృష్ణ మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. రమ్యకృష్ణకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అధిక రక్తస్రావం కావడంతో రమ్యకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వీడియోల కోసం :

ఏఐతో ఓ యూజర్‌ సంభాషణ.. షాక్‌తిన్న చాట్‌జీపీటీ.. ఏం జరిగిందంటే..

వింత ఘటన.. నీలం రంగులో గుడ్డు పెట్టిన నాటు కోడి వీడియో

17వ బిడ్డకు జన్మనిచ్చిన మహిళ.. ‘తల్లికి వందనం’ అమలు చేయాలంటూ డిమాండ్ వీడియో