విమానం గాల్లో ఉండగా ఊడిన టైరు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు.
ఈ మధ్య బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక ఇతర సమస్యలు ఎదురవడం ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ సంస్థ తయారుచేసిన మరో విమానం గాల్లోకి ఎగరిన కాసేపటికే టైరు ఊడి పడిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 757-200 విమానం సోమవారం లాస్‌ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది.
ఈ మధ్య బోయింగ్ విమానాల్లో వరుసగా సాంకేతిక ఇతర సమస్యలు ఎదురవడం ప్రయాణికులకు ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఈ సంస్థ తయారుచేసిన మరో విమానం గాల్లోకి ఎగరిన కాసేపటికే టైరు ఊడి పడిపోయింది. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. యునైటెడ్ ఎయిర్‌లైన్స్ కు చెందిన బోయింగ్ 757-200 విమానం సోమవారం లాస్‌ఏంజిల్స్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయల్దేరింది. అయితే, టేకాఫ్ అయిన కొద్ది నిమిషాలకే ల్యాండింగ్ గేర్ టైర్ ఊడిపోయింది. అనంతరం విమానం డెన్వర్‌లో సురక్షితంగా ల్యాండ్ అవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులతో పాటు ఏడుగురు సిబ్బంది ఉన్నారు. విమానం నుంచి టైర్ ఊడిపోతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఈ ఘటనపై యునైటెడ్ ఎయిర్‌లైన్స్ స్పందిస్తూ… ఊడిన టైరు లాస్ ఎంజిల్స్‌లో లభించిందని, ఈ ఘటనపై విచారణ జరుపుతామని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సర్కారీ పథకం డబ్బు తీసుకున్నారు.. భర్తలను వదిలేసి లవర్స్‌తో జంప్ అయిన భార్యలు
వామ్మో.. దేవుడో.. 16 కీటకాలు తినేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సంస్కారం మరచిన యూట్యూబర్‌కి.. సర్కారు చెంప దెబ్బ
ఆయన తలపై గురిపెట్టుకున్న గన్స్ వేలం.. రూ. 15 కోట్లకు కొనుక్కున్న అజ్ఞాత వాసి