దారికి అడ్డంగా ఉందని.. గ్రేట్‌వాల్‌ ఆఫ్‌ చైనానే తవ్వేశారు..

|

Sep 07, 2023 | 9:47 AM

గోడ అంటేనే.. అడ్డంకి.. అదే వేల కిలోమీటర్ల పొడవైన గోడ ఉంటే.. అందుకే.. ఈ అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లడమే కర్తవ్యం అనుకున్నారో ఏమో.. ఏకంగా చారిత్రక ‘గ్రేట్‌ వాల్‌’ నే తవ్వేశారు కొందరు ఘనులు. ఈ ఘటన చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. అవును, చారిత్రక కట్టడం గ్రేట్‌ వాల్‌ ఆఫ్ చైనా ను ఇద్దరు వ్యక్తులు తవ్వేశారు . చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో గ్రేట్ వాల్‌లోని ఒక భాగాన్ని బుల్డోజర్ తో తవ్వేందుకు ప్రయత్నించారు.

గోడ అంటేనే.. అడ్డంకి.. అదే వేల కిలోమీటర్ల పొడవైన గోడ ఉంటే.. అందుకే.. ఈ అడ్డంకులను తొలగించి ముందుకు వెళ్లడమే కర్తవ్యం అనుకున్నారో ఏమో.. ఏకంగా చారిత్రక ‘గ్రేట్‌ వాల్‌’ నే తవ్వేశారు కొందరు ఘనులు. ఈ ఘటన చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో చోటు చేసుకుంది. అవును, చారిత్రక కట్టడం గ్రేట్‌ వాల్‌ ఆఫ్ చైనా ను ఇద్దరు వ్యక్తులు తవ్వేశారు . చైనాలోని ఉత్తర షాక్సి ప్రావిన్స్‌లో గ్రేట్ వాల్‌లోని ఒక భాగాన్ని బుల్డోజర్ తో తవ్వేందుకు ప్రయత్నించారు. విషయం వెలుగులోకి రావడంతో ఆ ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రావిన్స్‌లోని యూయు కౌంటీ వద్ద యాంగ్‌క్యాన్హె టౌన్‌షిప్‌ సమీపంలో గ్రేట్‌వాల్‌ను తవ్వేసినట్లు ఆగస్టు 24వ తేదీన అధికారులకు సమాచారం అందింది. అధికారులు తక్షణమే అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. ఓ 38 ఏళ్ల వ్యక్తి, 55 ఏళ్ల మహిళ కలిసి యంత్రాల సాయంతో గ్రేట్‌వాల్‌కు ఉన్న గ్యాప్‌ను పెంచేందుకు భారీగా తవ్వినట్లు తేలింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కోనసీమ కొత్త కోడలికి అద్దిరిపోయే కానుక.. నిశ్చితార్థంలోనే ఇలా ఉంటే..

వింత ఆచారం.. దేవుడికి తేళ్లతో నైవేద్యం.. ఆలయానికి పోటెత్తిన భక్తులు

అమెరికాలో తల్లిదండ్రులకు దూరం కానున్న భారత సంతతి పిల్లలు !!

మియామీ తీరంలో అలలపై తేలియాడిన ట్రంప్ కూతురు ఇవాంక

ఇంజిన్‌ లేకుండానే కదిలిన రైలు !! ఆశ్చర్యంలో రైల్వే అధికారులు

 

Follow us on