బూచోళ్లు తిరుగుతున్నారు !! తల్లిదండ్రులారా జాగ్రత్త

|

Oct 31, 2024 | 8:56 PM

డబ్బుల కోసం దుండగులు ఎంతకైనా తెగిస్తున్నారు. దొంగతనాలకు పాల్పడటం, చిన్న పిల్లలను కిడ్నాప్ చేయడం, మహిళల మెడలో ఉన్న బంగారు నగలను దోచుకుంటున్నారు. ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని చట్టాలు వచ్చినా.. దుండగులు ఏ మాత్రం వెనుకాడ్డం లేదు. జల్సాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు.

తాజాగా.. హైదరాబాద్ పాతబస్తీలో ఓ బాలిక నడుచుకుంటూ మరో ఇంటి వైపు వెళ్తూ ఉంది. ఇంతలోనే గుర్తు తెలియని ఓ వ్యక్తి వాహనంపై వచ్చి “మీ నాన్న ఉండే షాపు వైపు వెళుతున్నా.. రా నిన్ను అక్కడ వదిలేస్తా’ అని చెప్పాడు. ఇంకేముంది.. ఆ వ్యక్తి మాటలు నిజం అని నమ్మిన చిన్నారి అతనితో పాటు ఆ వాహనంపై ఎక్కడానికి సిద్ధమైంది. ఆ తర్వాత ఆ వ్యక్తి చిన్నారి తండ్రి షాపు వైపు వెళ్లాల్సింది పోయి.. మరోవైపు వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. దీంతో పరిస్థితి అర్థమైన చిన్నారి కేకలు పెడుతూ అక్కడి నుంచి దిగి ఇంటి వైపు పరుగులు పెట్టింది. అయితే ఈ మొత్తం తతంగం అక్కడి సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డు అయింది. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని గుర్తు పట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వ్యవహారంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా ఎక్కడికి బయటకి పంపకూడదని.. ఒకవేళ పంపించినా కూడా గుర్తు తెలియని వ్యక్తులతో మాత్రం అసలే వెళ్లకూడదని చిన్నపిల్లలకి నేర్పించాలని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇద్దరు దుండగులు పట్ట పగలే ఓ ఇంట్లోకి దర్జాగా వచ్చి పిల్లలను కిడ్నాప్ చేసిన ఘటన తాజాగా బెంగళూరులో జరిగింది. మంచినీళ్ల పేరుతో ఓ ఇంట్లోకి వచ్చిన కిడ్నాపర్లు.. అక్కడే చిన్నారులతో ఆడుకుంటున్న అమ్మమ్మను తాగడానికి మంచినీళ్లు అడిగారు. వారికి నీళ్లు ఇచ్చేందుకు ఆ వృద్ధురాలు ఇంట్లోకి వెళ్ళగానే దుండగులు పిల్లలతో పరార్ అయ్యారు. పిల్లలను తీసుకుని పరిగెడుతున్న వీడియో సీసీ కెమెరాల్లో రికార్డు అయింది. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు దొంగలను పట్టుకున్నారు. అయితే తండ్రి కారణంగానే ఆ ఇద్దరు పిల్లలు కిడ్నాప్‌కి గురైనట్లు తెలుస్తోంది. నిందితుల వద్ద డబ్బులు తీసుకున్న ఆ ఇద్దరి పిల్లల తండ్రి వాటిని డబుల్ చేసి ఇస్తానని వారికి హామీ ఇచ్చినట్లు సమాచారం. అయితే డబ్బులు ఇవ్వకుండా నిందితులను మోసం చేయడంతో వారు పిల్లలను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Amaran: శివ కార్తికేయన్‌ ‘అమరన్’ సినిమా.. హిట్టా ?? ఫట్టా ??

గోవా రైల్లో బుస్‌.. బుస్‌..సెకెండ్‌ ఏసీలో కర్టెన్‌ తీసి చూస్తే షాక్‌..

లక్కీ భాస్కర్.. హిట్టా ?? ఫట్టా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి

ఎల్పీజీ కంటే ఈ సిలిండర్‌ చాలా డేంజర్‌.. ఎందుకో తెలుసా ??

Follow us on