ఆ మరణాలు బొడ్రాయి వల్లేనా?వీడియో
గ్రామాల్లో చాలా చోట్ల కూడా బొడ్డురాళ్ళని ప్రతిష్ఠాపన చేస్తుంటారు. ప్రతిష్ఠ చేసిన దగ్గరనుంచి కూడా ఆ బొడ్డురాళ్ళకి వివిధ పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తా ఉంటారు. అయితే కొన్ని చోట్ల బొడ్డురాళ్ళ యొక్క ప్రతిష్ఠ సక్రమంగా జరగలేదనో, కొంత అరిష్టం సంభవించిందనేది చాలా పెద్ద ఎత్తున వినిపిస్తున్నమాట. ఈ క్రమంలోనే తురకపాలెంలో కూడా కొంతకాలంగా ఇదే మాట వినిపిస్తుంది.
గ్రామంలో బొడ్డురాయి పండగ సక్రమంగా చేయకపోవడం వల్లనే అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయి అనేక అసహజ మరణాలు సంభవించినాయని భావిస్తున్నారు అక్కడి వారు. అసలు బొడ్డురాళ్ళ ప్రాధాన్యత ఏంది? బొడ్డురాళ్ళు ఎందుకు ఏర్పాటు చేస్తారనే అంశాలన్నీ మనం తెలుసుకుందాం అసలు గ్రామాల్లో బొడ్డురాళ్ల ఏర్పాటు ఎందుకు చేస్తారు? ఇది ఆంధ్రప్రదేశంలోను తెలంగాణలో కూడా ఉన్న పెద్ద పండుగ. దీనిగురించి ఇప్పుడు తెలుసుకుందాం బొడ్డురాళ్ళకి ప్రతి సంవత్సరం పూజ చేయడం, ప్రాణ ప్రతిష్ట చేయడం ఆనవాయితీ. అయితే దీని వలన అనారోగ్యాలు సమస్యలు, తీవ్రమైనటువంటి ప్రమాదకరమైనటువంటి మరణాలు తగ్గిపోతాయని మనకు శాస్త్రధర్మం చెబుతున్నది. ఆ ధర్మం ప్రకారంగా వాటిని ఆచరిస్తారు. అది పరిస్థితి. ఎందుకు ప్రతిష్ఠాపన చేస్తారు అసలు ప్రతిష్ఠ యొక్క ఉద్దేశ్యం ఏంటి? ప్రతిష్ఠ ఉద్దేశం గ్రామం మొత్తానికి మధ్య భాగాన్ని తీసుకొని అక్కడ ప్రతిష్ఠ చేస్తారు. ఆ వచ్చేటటువంటి ఆ కుటుంబీకులు వాళ్ళ వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటటువంటి ఏదైనా శుభకార్యాలు, సమస్త కార్యాలు చేసేటప్పుడు ఆ స్వామివారి దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని వెళుతుంటారు. దానికి అది పరిస్థితి. ఇది కాకుండా ఓన్లీ ఆరోగ్యం కోరకే దాన్ని పూజిస్తే అనేక రకాల వైరస్ వ్యాధులు రాకుండా ఉంటాయని మనకు శాస్త్రం చెబుతుంది.
మరిన్ని వీడియోల కోసం :
