Triangle Love Story: వాట్ ఏ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. లాటరీ పద్ధతిలో పెళ్లి వైరల్ అవుతున్న వీడియో..

|

Sep 08, 2021 | 9:16 AM

కర్నాటకలో జరిగిన ఓ రియల్‌ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. ఒకే యువకుడిని ఇద్దరు ప్రేమించిన కథకు ఎలా పులిస్టాప్‌ పెట్టాలో తెలియక తలలు పట్టుకున్నారు గ్రామస్థులు. కట్‌ చేస్తే..

కర్నాటకలో జరిగిన ఓ రియల్‌ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ.. సోషల్‌ మీడియాలో ఫుల్‌ వైరల్‌ అవుతుంది. ఒకే యువకుడిని ఇద్దరు ప్రేమించిన కథకు ఎలా పులిస్టాప్‌ పెట్టాలో తెలియక తలలు పట్టుకున్నారు గ్రామస్థులు. ఇక ఇదే సమయంలోనే ఓ యువతి విషయం తాగి ఆత్మహత్యయత్నం చేసుకుని ప్రాణాలతో బయటపడింది. కట్‌ చేస్తే.. చికిత్స తర్వాత ఈ మధ్యే యువతి ఇంటికి రావడంతో.. ఈ కథ మరోసారి పెద్దల ముందుకు వచ్చింది. ఇక ఎలాగైనా ఈ స్టోరీకి పుల్‌స్టాప్‌ పెట్టాలని ఆలోచించిన పెద్దలు.. ఓ విచిత్రమైన పద్ధతిని ఫాలోఅయ్యారు. ఇంతకీ.. ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీకి శుభం కార్డు ఎలా పడిందో మీరే చూడండి.!

కర్నాటకకు చెందిన సకలేశపుర ప్రాంతానికి చెందిన యువకుడు సోషల్ మీడియాలో ఇద్దరు యువతులను ప్రేమించాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో కొన్ని రోజులుగా ప్రేమాయణం కొనసాగించాడు. అయితే.. ఆ ఇద్దరు యువతులు కూడా ఆ యువకుడిని గాఢంగా ప్రేమించారు. తీరా యువకుడి విషయం తెలిసిన తర్వాత.. అతనే కావాలంటూ ఇద్దరూ కూడా పట్టుబట్టారు. అతను లేకుండా బతకలేమన్నారు. చివరకు అతడిని వివాహం చేసుకునేందుకు ఇద్దరూ రెడీ అయ్యారు.అయితే ఇంతలో మరో ట్విస్ట్‌ వచ్చిపడింది. ఇద్దరిలో ఎవరిని వివాహం చేసుకోవాలో ఆ యువకుడికి అర్థం కాలేదు. గ్రామస్థులు పంచాయితీ చేసినా ఫలితం లేకుండాపోయింది. ఈ క్రమంలో ఓ యువతి ఆ యువకుడు లేకుండా ఉండలేనంటూ విషం తాగింది. అయితే.. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇటీవలే ఆమె కోలుకుని గ్రామానికి తిరిగి రాగా.. మరోసారి ఈ ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీ తెరపైకి వచ్చింది. దీనిపై మరోసారి పంచాయితీ నిర్వహించారు.

ఈ క్రమంలో ఎవరూ మాటవినకపోవడంతో గ్రామస్థులు చివరికి ఓ మార్గాన్ని కనిపెట్టారు. లాటరీ ద్వారా ఒకరిని ఎంపిక చేస్తామని.. ఇందులో పేరు రాని యువతి ఎలాంటి ఫిర్యాదు చేయకుండా మౌనంగా వెనుదిరగాలంటూ షరతులు విధించారు. అనంతరం ఇద్దరు యువతుల సమ్మతితో లాటరీ తీయగా.. అందులో విషం తాగిన యువతి పేరొచ్చింది. దీంతో ఆ యువకుడితో ఆమె వివాహం జరిపించారు.YouTube video player
మరిన్ని ఇక్కడ చూడండి: గుంతల రోడ్డుపై క్యాట్‌ వాక్‌..! వైరల్‌గా మారిన వీడియో..: Cat walk on pothole road video

Girl Amazing Stunt video: అది బాడీనా.. స్ప్రింగా..? ఈ అమ్మాయి స్టంట్ చుస్తే షాకవుతారు.. వైరల్ అవుతున్న వీడియో..

Online Marriage Viral Video: అమెరికా పెళ్లికి..ఆంధ్రాలో ఆశీస్సులు.. ట్రేండింగ్ లో ఆన్లైన్ పెళ్లిళ్లు వీడియో వైరల్..

Nipah Virus Vs Coronavirus Video: క్లిష్ట పరిస్థితుల్లో దేశం.. కరోనాకు నిఫాతోడు.. ముంచుకొస్తున్న ముప్పు లైవ్ వీడియో..