రోడ్డు పై పులి ప్రత్యక్షం.. సెల్ఫీల కోసం ఎగబడిన జనం
మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో పర్యాటకుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారితీసింది. మొహర్లీ జోన్‌లో సఫారీ సమయంలో పులి కనిపించడంతో కొందరు పర్యాటకులు వాహనాల నుంచి కిందకు దిగి దాని దగ్గరకు వెళ్లారు. సెల్ఫీలు, వీడియోలు, రీల్స్ కోసం భద్రతా నిబంధనలను ఉల్లంఘించడంపై వన్యప్రాణి ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పులులను ప్రశాంతంగా వీక్షించాలి తప్ప, వాటిని ఇబ్బంది పెట్టకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు.
మహారాష్ట్రలోని ప్రసిద్ధ తడోబా-అంధారి టైగర్ రిజర్వ్‌లో పర్యాటకుల తీరు అందరినీ ఆగ్రహానికి గురిచేసింది. రిజర్వ్ పరిధిలోని మొహర్లీ జోన్‌లో సఫారీ చేస్తుండగా రోడ్డుపై అకస్మాత్తుగా ఒక పులి ప్రత్యక్షమైంది. సాధారణంగా అడవిలో పులి కనిపిస్తే అందరూ భయంతో వాహనాల్లోనే బిక్కుబిక్కుమంటూ కూర్చుంటారు. కానీ, ఇక్కడ మాత్రం పర్యాటకులు భద్రతా నియమాలను పూర్తిగా గాలికి వదిలేశారు. పులిని చూడగానే కొందరు పర్యాటకులు కేవలం ఫోటోలు, వీడియోల కోసం తమ వాహనాల నుంచి కిందకు దిగి పులికి దగ్గరగా వెళ్లారు. పులి నుంచి సురక్షితమైన దూరం పాటించకుండా, సెల్ఫీలు, సోషల్ మీడియా రీల్స్ కోసం ఏకంగా తమ ప్రాణాలను, ఆ మూగజీవి ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత పర్యాటకుల నిర్లక్ష్య వైఖరిపై వన్యప్రాణి ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవిలోకి వెళ్లేవారు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఇలాంటి పిచ్చి సాహసాలు ప్రాణాల మీదికి తెస్తాయని హెచ్చరిస్తున్నారు. తడోబాలో సఫారీ ముఖ్య ఉద్దేశ్యం పులిని ప్రశాంతంగా వీక్షించడం మాత్రమేనని, దాన్ని ఇబ్బంది పెట్టడం కాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హాస్టల్‌లో దెయ్యం..! భయంతో ఖాళీ చేసి వెళ్లిపోయిన విద్యార్ధినిలు
