40 అడుగుల ఎత్తు నుంచి పడ్డ టూరిస్ట్! ఏం జరిగిందో మీరే చూడండి!

Updated on: Jul 23, 2026 | 8:53 PM

కర్ణాటకలోని దండేలి రిసార్ట్‌లో జిప్‌లైన్ రైడ్ చేస్తున్న యువకుడు సేఫ్టీ లాక్ విఫలమవడంతో 40 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. రిసార్ట్ యాజమాన్యం భద్రతా ప్రమాణాలు పాటించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో సాహస క్రీడల్లో భద్రతపై మరోసారి చర్చ మొదలైంది.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా దండేలిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ రిసార్ట్‌లో జిప్‌లైన్‌ రైడ్‌ చేస్తున్న ఓ యువకుడు ప్రమాదవశాత్తు 40 అడుగుల ఎత్తునుంచి కిందపడిపోయాడు. జిప్‌లైన్ రైడ్ చేస్తుండగా సేఫ్టీ లాక్ ఊడిపోవడంతో ప్రమాదం జరిగింది. విజయపురకు చెందిన 24 ఏళ్ల కుబేర్ సురపురా అనే పర్యాటకుడు జూలై 3న తన కుటుంబ సభ్యులతో కలిసి ‘స్టెర్లింగ్ రివర్ రిసార్ట్’కు వెళ్లాడు. అక్కడ కుబేర్‌ జిప్‌లైన్‌ రైడ్‌ చేయాలనుకున్నాడు. అయితే ఆ జిప్‌లైన్‌కు ఉన్న సేఫ్టీలాక్‌ తుప్పు పట్టి ఉండటంతో రైడ్‌ చేస్తుండగా అది ఒక్కసారిగా ఫెయిలయింది. దాంతో కుబేర్ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఆయన కాళ్లు, చేతులు విరగడమే కాకుండా నరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాధితుడిని మొదట దండేలి ప్రభుత్వ ఆసుపత్రికి, ఆ తర్వాత విజయపుర, అనంతరం మెరుగైన చికిత్స కోసం మిరాజ్ ఆసుపత్రికి తరలించారు. రిసార్ట్ యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం, సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సాహస క్రీడా కేంద్రాల వద్ద నిరంతరం భద్రతా తనిఖీలు చేపట్టాలని, నిర్లక్ష్యం వహించిన రిసార్ట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Tirumala: అన్నప్రసాదాల పంపిణీకి కొత్త టెక్నాలజీ టీటీడీ వినూత్న ప్రయోగం

Marriage Bureau: పెళ్లి కాని ప్రసాద్‌లకు గుడ్ న్యూస్.. పిల్లను వెతకని మ్యారేజ్ బ్యూరోకు జుర్మానా

Follow Us