కళాకారుడి అపురూప సృష్టి.. రామయణం మొత్తం సూక్ష్మ చిత్రాలలో
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా అద్భుతమైన చిత్రాన్ని వేసి అందరిని అబ్బుర పరిచారు. ఏత్రీ డ్రాయింగ్ షీట్ పై ఒకే చిత్రంలో రామయణంలోని ముఖ్యమైన ఘట్టాలను సూక్ష్మ మైన చిత్రాలతో అద్భుతంగా చిత్రీకరించి రామునిపై తన భక్తిని చాటుకున్నారు కోటేష్. దాదాపు 8 గంటలపాటు శ్రమించి వాటర్ కలర్స్‌తో ఈ పెయింటింగ్ వేసినట్టు తెలిపారు.
నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లి కోటేష్ అయోధ్య రామమందిరంలో బాలరాముని ప్రాణప్రతిష్ట సందర్భంగా అద్భుతమైన చిత్రాన్ని వేసి అందరిని అబ్బుర పరిచారు. ఏత్రీ డ్రాయింగ్ షీట్ పై ఒకే చిత్రంలో రామయణంలోని ముఖ్యమైన ఘట్టాలను సూక్ష్మ మైన చిత్రాలతో అద్భుతంగా చిత్రీకరించి రామునిపై తన భక్తిని చాటుకున్నారు కోటేష్. దాదాపు 8 గంటలపాటు శ్రమించి వాటర్ కలర్స్‌తో ఈ పెయింటింగ్ వేసినట్టు తెలిపారు. ఈ చిత్రంలో శ్రీరాముని జననం నుండి సీతాదేవి అగ్ని పరీక్ష వరకు జరిగిన పలు ఘట్టాల సన్నివేశాలను అందరికీ అర్ధమయ్యేలా అద్భుతంగా చిత్రీకరించారు. 500 ఏళ్ల భారత ప్రజల కల సాకారమవుతున్న నేపథ్యంలో చాలా సంతోషంగా ఉందంటూ ఆనందం వ్యక్తం చేశారు కోటేష్. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడైన శ్రీరాముని గాథ ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుందని, అలాగే అందాల రాముని ఎన్నిసార్లు చిత్రించినా ఇంకా ఇంకా చిత్రించాలనిపిస్తుందన్నారు. ఈ చిత్రం ఆ శ్రీరాముని పాదాలకు అంకితం అంటూ చిత్రకారుడు శ్రీరాముడి పై తన ప్రేమను వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sitara Ghattamaneni: అనాధ బాలలతో కలిసి సినిమా చూసిన సితార
శరీరమంతా రాముని పచ్చబొట్టు వేసుకున్న వారిని ఎప్పుడైనా చూశారా !!