పొదల్లో దాగిన పులిని వీడియో తీస్తుండగా !! ఏం జరిగిందంటే ??

Updated on: Dec 13, 2022 | 9:36 PM

మనలో చాలా మంది సఫారీకి వెళ్లి.. వన్యమృగాల్ని అత్యంత దగ్గరగా చూడాలనుకుంటారు. అయితే ఈ సఫారీ అనేది అన్నిసార్లూ సాఫీగా సాగదు. అడవిలో వన్యమృగాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం.

మనలో చాలా మంది సఫారీకి వెళ్లి.. వన్యమృగాల్ని అత్యంత దగ్గరగా చూడాలనుకుంటారు. అయితే ఈ సఫారీ అనేది అన్నిసార్లూ సాఫీగా సాగదు. అడవిలో వన్యమృగాలు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో చెప్పలేం. అవి తలచుకుంటే మనుషులపై ఇట్టే దాడి చేస్తాయి. సఫారీలో మనతో గైడ్లు ఉన్నా.. అప్రమత్తంగా ఉండకపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుచేత అక్కడకి వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండాలి. ఏ పొద నుంచి ఏ జంతువు దూసుకొస్తుందో, ఎలా దాడి చేస్తుందో తెలియదు. అలాంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ పెద్ద పులి పొదల్లో దాక్కొని ఉంది. పర్యాటకుల సఫారీ వెహికిల్.. ఆ పులికి అతి దగ్గరగా వచ్చింది. పొదల మాటున ఉన్న పులిని వీడియో తియ్యడం మొదలుపెట్టారు టూరిస్టులు. దీంతో ఒక్కసారిగా ఆ పులి గర్జిస్తూ వారివైపు దూసుకొచ్చింది. వారిపై దాడి చెయ్యబోయింది. అదిరిపడిన వారు కేకలు పెడుతూ.. దాన్ని తరిమారు. వెనక్కి తగ్గిన పులి.. తిరిగి పొదల్లోకి వెళ్లిపోయింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి వీడియోను ఫారెస్ట్ అధికారి పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూడు సింహాల వెనుక ధైర్యంగా అడుగేస్తూ మహిళ !! నెట్టింట వీడియో వైరల్

ఇదేం చికెన్ కుర్మా !! మండిపడుతున్న నెటిజ‌న్లు

మరో ట్యాలెంట్‌ను పట్టేసిన టెక్‌ దిగ్గజం.. ఇతని టాలెంట్ చూసి నెటిజెన్స్ కూడా ఫిదా

రవితేజ మాటలపై తెలంగాణ ప్రజలు సీరియస్

Ravi Teja: బాస్‌ ట్వీట్‌కు.. మాస్‌ ఎమోషనల్ టచ్‌ !!

 

Published on: Dec 13, 2022 09:36 PM
Loading...
Unable to load recommendations.
Follow Us