Trending Video: పెళ్లి కానీ ప్రసాద్‌లకు గుడ్‌న్యూస్..! పెళ్లి కావాలంటే ఈ జాతరే దిక్కు.. వచ్చేయండి మరి.

Updated on: Apr 17, 2023 | 9:46 AM

ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలను కర్రలతో కొడతారు.. అలా కొట్టించుకుంటే పెళ్లి అవుతుందని అబ్బాయిల నమ్మకం. వివిధ ప్రాంతాల నుంచి బ్యాచిలర్స్ ఈ జాతరకు పెద్ద ఎత్తున తరలివస్తారు.

అబ్బాయిలను ఉరికించి ఉరికించి కొడుతున్నారు అమ్మాయిలు.. అలా చేస్తే పెళ్లి అవుతుందట! ఒక్కొక్క ఊరిలో ఒక్కొక సంప్రదాయం ఉంటుంది.. అవి నిజాలా, కేవలం నమ్మకాలేనా అన్నది అటు ఉంచితే కొన్ని విషయాలు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగిస్తాయి. వింత వింత ఆచారాలు మన దేశంలో ఉంటాయి.. ముఖ్యంగా చాలా వరకు పెళ్లి చుట్టూనే అవి తిరుగుతుంటాయి.. పెళ్లి అవ్వడంలేదని గుళ్ల చుట్టూ తిరిగే వాళ్లు ఎందరో.. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌‌లో ఓ జాతర చాలా ఫేమస్.. ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలను కర్రలతో కొడతారు.. అలా కొట్టించుకుంటే పెళ్లి అవుతుందని అబ్బాయిల నమ్మకం. వివిధ ప్రాంతాల నుంచి బ్యాచిలర్స్ ఈ జాతరకు పెద్ద ఎత్తున తరలివస్తారు. అమ్మవారి దర్శనం తర్వాత కర్రలతో కొట్టించుకుంటారు. అయితే ఇదంతా సీరియస్‌గా కొట్టించుకునే దెబ్బలు కాదు. ఒక ఆటలాగా ఉంటుందన్నమాట. ఈ బెత్తం కొట్టే సంబరాన్ని దింగ గవర్ జాతరగా పిలుస్తారు. దీని కోసం ఆప్రాంత జనం ఏడాది పొడవునా ఆసక్తిగా ఎదురుచూస్తారు. మహిళా సాధికారతకు ఈ జాతర కూడా ఒక ప్రత్యేక ఉదాహరణ. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శుక్ల పక్షం మూడవ రోజున దింగ గవర్ జాతర జరుపుకుంటారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Lati Charge on Allu Arjun Fans: అర్థరాత్రి పోలీసోళ్లకు చుక్కలే..! ఏమాత్రం తగ్గని బన్నీ ఫ్యాన్స్..

Allu Arjun Vibrant Look: ఉగ్రగంగమ్మగా పుష్పరాజ్‌.. సీన్ దద్దరిల్లాలే.. నెట్టింట ఊచకోత కోస్తున్న బన్నీ వీడియో..

Pushpa-2 Video: పుష్ప అడుగుపడితే.. పులి కూడా కుక్క అయిపోవాలే..! సోషల్ మీడియాను రఫ్పాడిస్తున్న పుష్ప..