సైలెంట్‏గా పని కానిచ్చేశారు !! ఏం దొంగిలించారో తెలిస్తే షాక్‌ !!

Updated on: Sep 05, 2022 | 8:34 PM

ఎవరు చూడకుండా ఇతరుల వస్తువులను దొంగిలించడమంటే మాములు విషయం కాదు. తమ మైండ్‏కు పదును పెట్టి.. ఎంతో తెలివిగా.. అచి తూచి దొంగిలిస్తుంటారు.

ఎవరు చూడకుండా ఇతరుల వస్తువులను దొంగిలించడమంటే మాములు విషయం కాదు. తమ మైండ్‏కు పదును పెట్టి.. ఎంతో తెలివిగా.. అచి తూచి దొంగిలిస్తుంటారు. కానీ సీసీ కెమెరాలు ఉంటాయనే విషయాన్ని మర్చిపోతుంటారు. ఇటీవల కొన్ని ఆశ్చర్యకరమైన దొంగతనాలకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అందులో కొన్ని నవ్వులు పూయిస్తే మరికొన్ని ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో ఇద్దరు వృద్దదంపతులు దొంగతనం చేసిన విధానం చూస్తే షాకవ్వాల్సిందే. ఎంతో ప్రోఫెషనల్‏గా తమ పని కానిచ్చేశారు. ఇంతకీ ఏం చేశారో తెలుసుకుందామా. ఇన్ స్టా ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఇద్దరు వృద్ద దంపతులు ఓ మాల్‏లోని ఎస్కలేటర్‌ పక్కన నిల్చుని ఉన్నారు. చాలా సమయం వరకు నిల్చున్న వారు.. ఆకస్మాత్తుగా పక్కనే ఉన్న మొక్కల నుంచి ఓ భాగాన్ని తెంపి బ్యాగ్‏లో వేసుకున్నారు. ఆ తర్వాత సైలెంట్‏గా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. చాలా ప్రొఫెషనల్ దొంగలు, లెజెండ్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇలాంటి రిస్క్‌ అవసరమేనా ?? బైక్ రైడర్ పై నెటిజన్లు ఫైర్ !!

అమ్మాయిని చూసి వరుడు పరుగో పరుగు.. ఎందుకలా ??

Published on: Sep 05, 2022 08:34 PM
Loading...
Unable to load recommendations.
Follow Us