Stole Garlic: వీళ్లేం దొంగలురా బాబోయ్.! వెల్లుల్లిని ఎత్తుకెళ్లారు.! వీడియో.

|

Feb 19, 2024 | 8:56 AM

దొంగోడికి చెప్పే నయం అనే సామెత కొన్ని రకాల దొంగతనాలను చూస్తే నిజమేనని అనిపిస్తుంటుంది. బంగారం దొంగలను చూశాం.. బట్టల దొంగలను చూశాం.. విలువైన వస్తువులను దొంగలించడం చూశాం.. ఇవేవీ కాకుండా విచిత్రంగా వెల్లుల్లిని ఎత్తుకెళ్లిన ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్‌లో ఓ రైతు పొలం నుంచి వెల్లుల్లిని ఎత్తుకుపోయారు దొంగలు.

దొంగోడికి చెప్పే నయం అనే సామెత కొన్ని రకాల దొంగతనాలను చూస్తే నిజమేనని అనిపిస్తుంటుంది. బంగారం దొంగలను చూశాం.. బట్టల దొంగలను చూశాం.. విలువైన వస్తువులను దొంగలించడం చూశాం.. ఇవేవీ కాకుండా విచిత్రంగా వెల్లుల్లిని ఎత్తుకెళ్లిన ఘటన కరీంనగర్‌ జిల్లాలో చోటు చేసుకుంది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని కన్నాపూర్‌లో ఓ రైతు పొలం నుంచి వెల్లుల్లిని ఎత్తుకుపోయారు దొంగలు. గ్రామానికి చెందిన గుండవేని శంకర్ అనే రైతు వ్యవసాయ భూమి వద్ద వెల్లుల్లి మడులు వేసుకున్నారు. ఉదయం ఎప్పటిలాగానే వ్యవసాయ భూమి వద్దకు వెళ్లి చూడగా పొలంలో వెల్లుల్లి మాయం అయింది. రాత్రి రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మడులను పూర్తిగా కోసుకొని తీసుకొని వెళ్లారు. వెల్లుల్లికి ధరలు ఎక్కువగా ఉండడంతో ఈ దొంగతనానికి పాల్పడ్డారు. స్థానిక కేశవపట్నం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు రైతు. దొంగలను గుర్తించి తమకు న్యాయం చేయాలని రైతులు వేడుకుంటున్నారు. సుమారు 40 వేల రూపాయిల వరకు నష్టపోయామని రైతు వాపోతున్నాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..