పెళ్లికి తప్పతాగి వచ్చిన వరుడు.. ఏం చేశాడో చూస్తే షాకవుతారు!వీడియో

Updated on: Mar 01, 2025 | 6:59 AM

మద్యానికి బానిసలైనవారిని మాన్పించడం అసాధ్యమనే చెప్పాలి. మద్యం పానం ప్రాణానికి హానికరం అని చెప్పినా మందుబాబులు ప్రాణాలకంటే.. తమవారి జీవితాలకంటే మద్యమే మాకు ముద్దు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అలా మద్యానికి అలవాటైన ఓ యువకుడు పెళ్లికి ఫుల్‌గా మద్యం సేవించి వచ్చాడు. పెళ్లిలో అతగాడు చేసిన నిర్వాకానికి వధువు ఊహించని షాకిచ్చింది. ఈ ఘటన యూపీలో చోటుచేసుకుంది. పెళ్లవుతుందన్న ఆనదం ఎక్కువయపోయి కాస్త ఎక్కువగానే వేసేసినట్టున్నాడు... వరుడు తూలుతూ పెళ్లి వేదికపైకి వచ్చాడు. వేదికపై వరమాల కార్యక్రమం జరుగుతోంది.

వధువు మొదట వరుడి మెడలో వరమాల వేసింది. వరుడి వాలకం చూసి కాస్త అనుమానం వచ్చినా వధువు కంట్రోల్‌ చేసుకుంది. అనంతరం వరుడు వంతు వచ్చింది. అప్పటికే మద్యం మత్తులో ఊగిపోతున్న వరుడు వధువు మెడలో వేయాల్సిన వరమాలను.. దండ తీసుకొచ్చి ఆమె ఫ్రెండ్‌ మెడలో వేశాడు. అంతే అప్పటి వరకూ కోపాన్ని అదుపులో ఉంచుకున్న వధువు ఒక్కసారిగా బ్లాస్ట్‌ అయింది. తన పరువు మొత్తం మంటగలిసిపోయిందని, ఇప్పుడే ఇలా ఉంటే.. పెళ్లయ్యాక తన జీవితం అంతా ఏడుస్తూనే ఉండాలని నిర్ధారించుకుని, ఈ పెళ్లి తనకు వద్దంటూ వేదిక దిగి వెళ్లిపోయింది. దీంతో ఇరు కుటుంబాలవారు షాకయ్యారు. వధువుకు నచ్చజెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. అయినా ఆమె ససేమిరా అంది. వరుడి కుటుంబ సభ్యులు ఎంత బ్రతిమాలినా.. వెనక్కి తగ్గని వధువు వారందరినీ పెళ్లీలేదు…ఏం లేదు పొమ్మని పంపించేసింది. చేసేదిలేక వరుడి కుటుంబం వచ్చిన దారినే వెళ్లిపోయింది. అనంతరం వధువు తండ్రి మగపెళ్లివారిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వరుడు, అతడి కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్న వేధింపులు, పరువునష్టం తదితర అభియోగాలతో కేసులు నమోదు చేశారు. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని వీడియోల కోసం :

ప్రధాని మోదీ తీసుకునే సూపర్‌ ఫుడ్‌ ఇదే.. లాభాలు తెలిస్తే షాకవుతారు!

చివరి అమృత్‌స్నాన్‌.. ప్రయాగ్‌రాజ్‌కు కోటి మందికి పైగా.. వీడియో!

ఫంక్షన్‌ హాల్లో కాదు పంట పొలంలో పెళ్లి.. కారణమేంటంటే.. వీడియో

ఆ గ్రహశకలంతో భూమికి తప్పిన ముప్పు.. ఏం జరిగిందంటే..!వీడియో

Published on: Mar 01, 2025 06:59 AM