Hyderabad: హైదరాబాద్‌లో బెగ్గింగ్ మాఫియా.. రోజుకు రూ.200లు ఇస్తూ బిచ్చమెత్తిస్తున్న గ్యాంగ్..
అవును.. మీరు చదివింది కరెక్టే.. కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, పిల్లలను, ఆడవాళ్లను బిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారు. వారిని రోడ్లపై అడుక్కోనిచ్చి.. ఆ డబ్బుతో బెగ్గింగ్ మాఫియా సభ్యులు జల్సాలు చేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా వెలుగుచూసింది. సిటీలో బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టుచేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, KBR పార్క్ దగ్గర బెగ్గింగ్..
అవును.. మీరు చదివింది కరెక్టే.. కొంతమంది దుర్మార్గులు తమ స్వార్థం కోసం ముసలి వాళ్లను, పిల్లలను, ఆడవాళ్లను బిక్షం ఎత్తుకునేలా చేస్తున్నారు. వారిని రోడ్లపై అడుక్కోనిచ్చి.. ఆ డబ్బుతో బెగ్గింగ్ మాఫియా సభ్యులు జల్సాలు చేస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ నగరంలో బెగ్గింగ్ మాఫియా వెలుగుచూసింది. సిటీలో బెగ్గింగ్ మాఫియా గుట్టు రట్టుచేశారు టాస్క్‌ఫోర్స్ పోలీసులు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, KBR పార్క్ దగ్గర బెగ్గింగ్ చేస్తున్న 23 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకలోని గుల్బర్గాకు చెందిన అనిల్ పవార్ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో నివాసముంటున్నాడు. వివిధ ప్రాంతాల నుంచి ముసలి వాళ్లను తీసుకువచ్చి.. వారితో భిక్షాటన చేయిస్తున్నాడు . అలా భిక్షాటన చేసుకొచ్చిన మొత్తాన్ని తానే తీసుకుని, వారికి రోజుకు 200 రూపాయలు జీతంగా ఇస్తున్నాడు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ అధికారులు బెగ్గింగ్ మాఫియాను అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రివెన్షన్ ఆఫ్ బెగ్గింగ్ యాక్ట్ కింద అనిల్ పవార్ పై కేసు నమోదు చేశారు. అనంతరం అతణ్ణి జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. అనిల్ వెనుక ఇంకా ఎవరు ఉన్నారు అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...