Viral Video: కన్నకొడుకుని హత్య చేసిన తల్లిదండ్రులు.. గుండెలను పిండేస్తున్న వీడియో..

Updated on: Aug 02, 2023 | 8:44 AM

తమిళనాడు కన్యాకుమారిలో విషాదం చోటుచేసుకుంది. కన్నబిడ్డను కడతేర్చినా ఆ తల్లిదండ్రులు ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కన్యాకుమారికి చెందిన మురళీధరన్, శైలజ దంపతులు. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. మురళీధరన్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇటీవలే కొత్తగా ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం కూడా చేశారు. అంతా బావుందనుకుంటే ఊహించని విధంగా ఈ దారుణానికి పాల్పడ్డారు ఆ దంపతులు.

తమిళనాడు కన్యాకుమారిలో విషాదం చోటుచేసుకుంది. కన్నబిడ్డను కడతేర్చినా ఆ తల్లిదండ్రులు ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కన్యాకుమారికి చెందిన మురళీధరన్, శైలజ దంపతులు. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. మురళీధరన్‌ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఇటీవలే కొత్తగా ఇల్లు నిర్మించుకుని గృహప్రవేశం కూడా చేశారు. అంతా బావుందనుకుంటే ఊహించని విధంగా ఈ దారుణానికి పాల్పడ్డారు ఆ దంపతులు. లోకం పోకడ తెలియని వయస్సులో ఉన్న కొడుకుని తల్లిదండ్రులే హత్య చేశారు. రాత్రి పడుకునే ముందు పాలలో నిద్రమాత్రలు కలిపి తాగించారు. ఆతర్వాత దిండుతో మొహంపై ఆదిమిపెట్టి ఊపిరి అడకుండా చేసి హత్యచేశారు. ఆతర్వాత అదే ఇంట్లో శైలజ, మురళీధరన్ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన స్థానికులు చిన్నారిని చంపేందుకు తల్లిదండ్రులకు మనసెలా ఒప్పిందంటూ విచారం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. విచారణలో షాకింగ్‌ విషయం బయటపడింది.

మురళీధరన్ కొడుకు జీవా మానసిక అనారోగ్యతో బాధపడుతున్నాడని పోలీసుల విచారణలో తేలింది. పరిష్కారం కోసం చాలామంది వైద్యులను కలిశారు తల్లిదండ్రులు. వైద్యులు కొడుకు మానసిక పరిస్థితి జీవితాంతం ఇలాగే ఉంటుందని చెప్పడంతో హతాశులైన ఆ తల్లితండ్రులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. తమ తర్వాత కొడుకు పరిస్థితిని ఊహించుకుని కొడుకును హత్య చేసి ఆత్మహత్య చేసుకున్నట్లు విచారణలో తేలింది. విషయం తెలిసి స్థానికులు విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...