పదేళ్ల బాలుడి సమయస్పూర్తి.. తప్పిన పెను ప్రమాదం

|

Sep 25, 2023 | 7:51 PM

ఓ పదేళ్ళబాలడి సమయస్పూర్తి, వందలమంది ప్రాణాలను కాపాడింది. జరగబోయే పెను ప్రమాదాన్నిముందే గ్రహించి ఆ బాలుడు వ్యవహరించిన తీరుకు ప్రశంసలు కురిపిస్తున్నారు రైల్వే అధికారులు. పశ్చిమబెంగాల్‌ మాల్దా జిల్లాకు చెందిన ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి కరియాలి గ్రామంలో నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం అతడు స్థానికంగా ఉన్న ఓ కుంటలో చేపలు పట్టేందుకు వెళుతుండగా రైలు పట్టాల కింద గొయ్యి కనిపించింది.

ఓ పదేళ్ళబాలడి సమయస్పూర్తి, వందలమంది ప్రాణాలను కాపాడింది. జరగబోయే పెను ప్రమాదాన్నిముందే గ్రహించి ఆ బాలుడు వ్యవహరించిన తీరుకు ప్రశంసలు కురిపిస్తున్నారు రైల్వే అధికారులు. పశ్చిమబెంగాల్‌ మాల్దా జిల్లాకు చెందిన ముర్సెలీమ్ అనే పదేళ్ల బాలుడు తన కుటుంబంతో కలిసి కరియాలి గ్రామంలో నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 22 మధ్యాహ్నం అతడు స్థానికంగా ఉన్న ఓ కుంటలో చేపలు పట్టేందుకు వెళుతుండగా రైలు పట్టాల కింద గొయ్యి కనిపించింది. మరోవైపు, అదే పట్టాలపై అగర్తల-సియాల్దా కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ రైలు వేగంగా దూసుకొస్తోంది. జరగబోయే ప్రమాదాన్ని గ్రహించిన బాలుడు క్షణం ఆలస్యం చేయకుండా పట్టాలవద్దకు పరుగెత్తాడు. పట్టాల వద్ద నిలబడి తాను ధరించిన ఎర్రని టీషర్టును తీసి గాల్లో ఊపుతూ ట్రెయిన్ లోకోపైలట్‌ను అప్రమత్తం చేశాడు. బాలుడి సిగ్నల్‌ను గమనించిన లోకోపైలట్ వెంటనే రైలును ఆపేశారు. బాలుడు నిలబడ్డ చోటుకు వచ్చి చూడగా అక్కడ పట్టాల కింద గొయ్యి కనిపించింది. అక్కడి కంకర కొట్టుకుపోవడంతో గొయ్యి ఏర్పడినట్టు గుర్తించారు. దీంతో, వెంటనే రైల్వే అధికారులకు సమాచారం అందించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Ram Pothineni: నువ్వేమైనా పెద్ద ఫిగర్‌వా !! శ్రీలీలపై రామ్ సెన్సేషనల్ కామెంట్స్

శ్రీవారి బస్సునే ఎత్తుకెళ్లాలనుకున్నాడు.. చివరికి ??

Parineeti Chopra: పెళ్ళి పీటలపై బాలీవుడ్​ క్యూట్​కపుల్..

రక్తపు మడుగులో బాలుడు.. శరీరంపై ఎలుకలు కొరికిన గాయాలు !!

రైల్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైట్.. 30 నిమిషాల్లోనే అమ్ముడుపోయిన టికెట్లు..