Bogatha Waterfall: బొగత జలపాతం చూడాలనుకుంటున్నారా ??
తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతానికి భారీగా వరద చేరుతోంది. దాంతో జలపాతం పరవళ్ళు తొక్కుతోంది. బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకులను అటవీశాఖ అధికారులు అనుమతించడంలేదు. చత్తీస్ గడ్ తో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చింది.
తెలంగాణ నయాగరాగా పేరుగాంచిన బొగత జలపాతం ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఛత్తీస్‌గఢ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో బొగత జలపాతానికి భారీగా వరద చేరుతోంది. దాంతో జలపాతం పరవళ్ళు తొక్కుతోంది. బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పర్యాటకులను అటవీశాఖ అధికారులు అనుమతించడంలేదు. చత్తీస్ గడ్ తో పాటు ములుగు, భూపాలపల్లి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు బొగత జలపాతం ఉగ్ర రూపం దాల్చింది. 50 అడుగుల ఎత్తు నుండి జాలు వారుతున్న జల సవ్వడులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. బొగత జలపాతం వద్ద అత్యంత ప్రమాదకరంగా వరద ప్రవాహం కొనసాగుతుండడంతో సందర్శకులను జలపాతం లోకి దిగడానికి అనుమతి లేకుండా, కేవలం చూడడానికి మాత్రమే అనుమతిస్తున్నారు. తాజాగా మరింత ఉధృతి పెరగడంతో, పర్యాటకులు వస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం బొగత కు రాకపోవడమే మంచిదని అటవీ శాఖ అధికారులు తెలిపారు. మళ్లీ వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత బొగత సందర్శనకు పర్యాటకులను అనుమతిస్తామని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విశాఖ తీరంలో అరుదైన చేప గుర్తింపు.. దీని ప్రత్యేకత ఏంటంటే ??
Mamata Banerjee: చీరకట్టు, స్మార్ట్ వాచ్‌తో మమతా బెనర్జీ జాగింగ్..
iPhone 15: ఐఫోన్ 15కు ఇస్రోకు ఉన్న సంబంధమేంటి ??
DSP: మ్యూజిక్ లవర్స్‌కు దేవి శ్రీ ప్రసాద్ స్సెషల్ గిఫ్ట్
Pallavi Prashanth: సూసైడ్ అటెంప్ట్.. ఆ ఘటన గుర్తుతెచ్చుకుంటూ.. ప్రశాంత్ పేరెంట్స్ ఎమోషనల్