వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

Updated on: Dec 26, 2025 | 10:48 AM

తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తీవ్రమైన చలితో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. చలిగాలులతో కొన్ని చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌లో నమోదయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. రాష్ట్రంలో రాగల రెండు రోజుల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాలలో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో సీజనల్‌ వ్యాధులు కూడా పంజా విసులురుతున్నాయి. ప్రతి ఇంట్లో చలి జ్వరంతో ప్రజలు బాధపడుతున్నారు. ప్రతి ఇంటా జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పుల బాధితులు కనిపిస్తున్నారు. రానున్న మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. చలి తీవ్రత వల్ల బాడీ మెకానిజం దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి బీపీ పెరగడం, తద్వారా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ అని హెచ్చరిస్తున్నారు. చలి నుంచి ఉపశమనం కోసం ఆల్కహాల్‌ తీసుకోవడం పరిష్కారం కాదని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మద్యం తాగేటప్పుడు రక్తనాళాలు వ్యాకోచించి శరీరానికి తాత్కాలికంగా వెచ్చదనం లభించినప్పటికీ, ఆ తర్వాత ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పడిపోతే, అది ‘హైపోథెర్మియా’ వంటి ప్రాణాంతక స్థితికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

2025లో చక్ దే ఇండియా..వీడియో

వాళ్లకు ప్రమోషన్ పాఠాలు నేర్పిస్తున్న స్టార్ డైరెక్టర్ వీడియో

చిరంజీవి సినిమాలో మలయాళ సూపర్ స్టార్? వీడియో

మార్పు మంచిదే అంటున్న అనన్య పాండే వీడియో