బీరుకు రూ.20-లిక్కర్‌కు రూ.70 వరకు.. మందు బాబులకు బ్యాడ్ న్యూస్ ??

|

Nov 05, 2024 | 6:37 PM

మొన్న ఏపీ వంతు అయిపోయింది.. ఇప్పుడు తెలంగాణ వంతు వచ్చేసింది. యస్‌.. మద్యం ప్రియులకు చేదువార్తే ఇది. తెలంగాణలో మద్యం ధరలను సవరించేందుకు ఆబ్కారీ శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మద్యం ధరలతో సమానంగా చేయాలని ప్రభుత్వ యోచనలో ఉందని సమాచారం.

త్వరలో బీరుకు 20 రూపాయలు, లిక్కర్‌కు 20 నుంచి 70 రూపాయల వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం ధరలు పెంచడం ద్వారా ప్రతినెలా వెయ్యి కోట్ల రూపాయల వరకు అదనంగా ఆదాయం సమకూరే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అయితే ప్రభుత్వం ఆశించిన స్థాయిలో ఎక్సైజ్‌ శాఖలో ఆదాయం రావడం లేదు. దీంతో ఇటీవల వాణిజ్య పన్నులు, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వితో సమీక్ష చేసిన సీఎం రేవంత్ రెడ్డి రాబడులను పెంచుకునేందుకు కఠినంగా ముందుకు వెళ్లాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఇందులో భాగంగానే గుడుంబా, అక్రమ మద్యం నిరోధానికి కఠిన చర్యలు చేపట్టారు. కాగా, రాష్ట్రంలో మద్యం ధరలు అధికంగా ఉన్నట్లు విమర్శలు రావడంతో గత ప్రభుత్వం 2023 మే నెలలో బీరుపై 10 రూపాయలు, లిక్కర్‌పై 20 రూపాయలు తగ్గించింది. అయితే ఆదాయం పెంచాలని ప్రస్తుతం ప్రభుత్వం చెబుతుండటంతో గతంలో తగ్గించిన ధరలతో పాటు మరికొంత అదనంగా చేర్చి ధరలు పెంచాలని అధికారులు యోచిస్తున్నారు. దీంతో మద్యం ధరలను వీలైనంత త్వరగా సవరించాలని ఎక్సైజ్‌ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యాల‌కుల నీళ్లు తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా ??