స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్‌.. ఆ తర్వాత సీన్‌ చూస్తే షాక్‌ అవుతారు!

Updated on: Jul 22, 2026 | 4:56 PM

ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్ జిల్లాలో నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఓ ఉపాధ్యాయురాలు విద్యార్థి క్లాస్‌రూమ్‌లోనే ఉన్నాడని గమనించకుండా తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. గంటన్నర తర్వాత గ్రామస్తుల సమాచారంతో బాలుడిని బయటకు తీసుకొచ్చారు. ఘటనపై తీవ్రంగా స్పందించిన అధికారులు సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించారు.

ఒక చిన్న పొరపాటు ఓ టీచర్‌ ఉద్యోగానికే ఎసరు పెట్టింది. ఉత్తరప్రదేశ్ జౌన్‌పూర్ జిల్లాలోని ఒక ప్రాథమిక పాఠశాలలో షాకింగ్‌ ఘటన జరిగింది. స్కూలు అయిపోగానే క్లాసు రూములన్నింటికి తాళం వేసి వెళ్లిపోయింది టీచర్‌. ఆ తర్వాత కాసేపటకి ఆ స్కూల్లోని రెండోతరగతి గదిలోనుంచి స్థానికులకు ఎవరో ఏడుస్తున్నట్టు శబ్ధం వినిపించింది. ఏమై ఉంటుందా అని పరిశీలించిన స్థానికులు క్లాస్‌లో కిటికీ వద్ద ఒంటరిగా ఏడుస్తూ కనిపించాడు ఓ విద్యార్ధి. పరియాన్వ్ గ్రామ పంచాయతీ పరిధిలోని బన్‌పుర్వా ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఒక బాలుడు క్లాస్‌రూమ్‌లో ఉన్నాడని గమనించకుండా, సహాయ ఉపాధ్యాయురాలు తరగతి గదికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయారు. లోపల ఒంటరిగా ఉన్న ఆ చిన్నారి బయటకు రాలేక కిటికీ వద్ద నిలబడి ఎవరైనా వస్తారేమోనని ఏడుస్తూ చూస్తున్నాడు. బాలుడ్ని గమనించిన గ్రామస్తులు వెంటనే స్కూల్ సిబ్బందికి సమాచారం అందించారు. దాదాపు గంటన్నర సమయం తర్వాత స్కూల్‌కు తిరిగి వచ్చిన సహాయ ఉపాధ్యాయురాలు కృష్ణ కుమారి తాళం తీసి బాలుడిని బయటకు రప్పించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని ఉపాధ్యాయుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. ఈ ఘటనపై జిల్లా ప్రాథమిక విద్యా శాఖాధికారి తీవ్రంగా స్పందించారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సహాయ ఉపాధ్యాయురాలు కృష్ణ కుమారిని వెంటనే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాకుండా ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ముంగ్రా బాద్‌షాహ్‌పూర్ బ్లాక్ విద్యాధికారిని ఆదేశించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఇకపై బహిరంగ మూత్ర విసర్జన చేశారో.. మీ ఫోటోలు ఎల్ఈడీ స్క్రీన్‌లో కనిపిస్తాయి!

శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి

75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!

కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!

Social Media Effect: లైక్స్‌ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

Follow Us