Tantric doctor: ప్రభుత్వ ఆసుపత్రిలో నాటువైద్యం.. యువతి చెవిలో మంత్రాలు చదివి నాటు వైద్యుడి చికిత్స.
మంత్రాలకు చింతకాయలు రాలతాయనే సామెత తరహాలోనే ఓ నాటు వైద్యుడు విచిత్ర ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. మంత్రాలకు విషం విరుగుడు అవుతుందని..రోగం నయం అవుతుందని జనాన్ని నమ్మించి సొమ్ము చేసుకుంటారు. అయితే
మంత్రాలకు చింతకాయలు రాలతాయనే సామెత తరహాలోనే ఓ నాటు వైద్యుడు విచిత్ర ట్రీట్‌మెంట్ ఇచ్చాడు. మంత్రాలకు విషం విరుగుడు అవుతుందని..రోగం నయం అవుతుందని జనాన్ని నమ్మించి సొమ్ము చేసుకుంటారు. అయితే ఈతరహా వైద్యం ఎక్కడో పల్లెటూళ్లు, ఏజెన్సీ ప్రాంతాల్లో చూస్తుంటాం. కాని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులోనే ఇలాంటి నాటు వైద్యానికి తెర తీశాడు మాయగాడు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లో ఈ విచిత్రమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. విషసర్పం కాటేయడంతో ఆసుపత్రికి వచ్చిన మహిళా పేషెంట్‌కి ఓ నాటు వైద్యుడు ఏం ట్రీట్‌మెంట్ చేశాడో అక్కడున్న వాళ్లంతా చూసి ఆశ్చర్యపోయారు. నాటు వైద్యుడి వ్యవహారం మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. తన చేతికి ఏదో విషసర్పం కరవడంతో ఓ యువతి మహోబా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. విషం శరీరంలోకి వ్యాపించకుండా వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. అయితే అక్కడ బాధితురాలికి ట్రీట్‌మెంట్ చేయడానికి డాక్టర్లకు బదులుగా నాటు వైద్యులు ఉండటం అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. బాధితురాలి చేతికి కట్టు కట్టిన తాంత్రిక వైద్యుడు.. ఆమె చెవులో నోరు పెట్టి గట్టిగా గాలి ఊదాడు. అంతే కాదు చెవిలో ఏదో మంత్రం చదవడంతో అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు. జిల్లా ఆసుపత్రికి విష కీటకాలు కరిస్తే వచ్చే వాళ్లకు నాటు వైద్యులతోనే చికిత్స అందిస్తున్నట్లుగా రోగి బంధువులు ఆరోపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Man – Crocodile: వామ్మో.. వీడి ధైర్యం పాడుగానూ.. మొసలితోనే రోమాన్స్..! నమ్మశక్యం గాని సరదా వీడియో..
No Weddings: ఇక్కడ పెళ్లిళ్లు వద్దు బాబోయ్.. వధూవరులకు నో వెల్కమ్ బోర్డులు.. ఎందుకంటే..