వీళ్లు అసలు మనుషులేనా ?? యజమానుల నిర్లక్ష్యం మరీ ఇంత దారుణం జరిగింది

Updated on: Mar 24, 2026 | 8:35 PM

తమిళనాడులో పెంపుడు కుక్క దాడిలో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. యజమానులు దాడిని ఆపకుండా నిర్లక్ష్యం వహించడం, బాధితులను దూషించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, పెంపుడు జంతువుల యజమానుల బాధ్యతపై తీవ్ర చర్చ జరుగుతోంది. బాధితులకు తక్షణ చికిత్స అందించాలని వైద్యులు సూచిస్తున్నారు. యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

సాధారణంగా పెంపుడు జంతువులు ప్రాణ స్నేహితులుగా ఉంటాయని నమ్ముతాం, కానీ ఈ కుక్క వింత ప్రవర్తన అందరినీ షాక్‌కు గురిచేసింది. తమిళనాడులో వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలపై ఒక ఇంటి పెంపుడు కుక్క ఒక్కసారిగా విరుచుకుపడి దాడి చేసింది.అయితే.. దాడి సమయంలో అక్కడే ఉన్న యజమానులు దానిని వారించకుండా నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ ఉండిపోయారు. బాధితులు భయాందోళనతో ఆర్తనాదాలు చేస్తున్నా యజమానులు స్పందించకపోవడంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో జంతువుల పెంపకందారుల బాధ్యతపై చర్చ జరుగుతోంది. బాధితులకు రేబీస్ ప్రమాదం పొంచి ఉందని, వెంటనే చికిత్స తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. తమిళనాడులోని నాగపట్నం జిల్లా తోప్పుతురై ప్రాంతంలో దారుణం జరిగింది. ఇద్దరు మహిళలు పవితా, ఆమె తల్లి తమ ఇంటికి వెళ్తుండగా ఓ పెంపుడు కుక్క వారిపై దాడి చేసింది. వారిద్దరూ రోడ్డుపై వెళ్తున్న సమయంలో ఇంటి గేటు తెరిచి ఉండటంతో కుక్క బయటకు వచ్చి పవితాను వెంబడించి దాడి చేసింది. పవితా నేలపై పడిపోయి తీవ్రంగా బాధపడుతుండగా ఆమె తల్లి.. కుక్కను తప్పించే ప్రయత్నం చేయగా.. అది ఆమెపై కూడా దాడి చేసింది. అయితే, కుక్క దాడి చేస్తున్న సమయంలో ఇంటి యజమానులు బయటకు వచ్చారు. పవితా, ఆమె తల్లిపై కుక్కు దాడి చేస్తున్నా వారు కుక్కను ఆపే ప్రయత్నం చేయలేదు. బాధితులకు సాయం చేయకుండా.. ఇంటి గేటును మూసివేశారు. అనంతరం, బాధితులు ఇద్దరూ కుక్కను లోపలికి పిలవాలని చెప్పినా వారు పట్టించుకోలేదు. పైగా బాధితులతో యజమానులు వాగ్వాదానికి దిగారు. కుక్క దాడితో బాధితులు ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని వేదారణ్యం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది ఈ వీడియో. ఈ ఘటన పెంపుడు జంతువులను బాధ్యతగా చూసుకోవడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తోంది. ఈ దాడిలో యజమానుల నిర్లక్ష్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వారిపై పోలీసు కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఏప్రిల్ 1 నుంచి మీ చేతికి వచ్చే జీతం మారబోతోందా ??

దడపుట్టించే సైకో క్రైమ్ థ్రిల్లర్ ఇది.. చూడటం మొదలు పెడితే కళ్ళు తిప్పరంతే

Sharwanand: రోహిత్ శర్మ బయోపిక్‌లో శర్వానంద్

మైక్రో ఫైనాన్స్ పేరిట భారీ మోసం.. వివరణ ఇచ్చిన మంగ్లీ

భీకర యుద్దంలోనూ.. పవర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు

Follow Us