Viral Video: నాగుపాము పొట్టలో సారా సీసా మూత..! వైద్యులకు పెద్ద పరీక్ష.. వైరల్ అవుతున్న పాము వీడియో..

|

Mar 27, 2022 | 10:28 PM

ఓర్నీ నాగుపాము పొట్టలో సారా సీసానా..? అదేలా సాధ్యం..ఇదే కదా మీ సందేహం..ఏం జరిగిందో, ఎలా ఇరుక్కుందో తెలియదు గానీ, ఓ సారా సీసా మూత నాగుపాము పొట్టలోకి వెళ్లి ఇరుక్కుపోయింది. పాపం దాంతోటి ఆ పాము పడరాని పాట్లు పడి అనారోగ్యం పాలైంది.


ఓర్నీ నాగుపాము పొట్టలో సారా సీసానా..? అదేలా సాధ్యం..ఇదే కదా మీ సందేహం..ఏం జరిగిందో, ఎలా ఇరుక్కుందో తెలియదు గానీ, ఓ సారా సీసా మూత నాగుపాము పొట్టలోకి వెళ్లి ఇరుక్కుపోయింది. పాపం దాంతోటి ఆ పాము పడరాని పాట్లు పడి అనారోగ్యం పాలైంది. అప్పుడు పాముకు ఆపరేషన్‌ చేసిన డాక్టర్లు పొట్టలో ఇరుక్కున్న మూతను బయటకు తీసేశారు..ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. భువనేశ్వర్‌లోని వాసుదేవ్‌ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో నాగుపాము ప్రత్యక్షమైంది. ఓ రూమ్‌లో మూడున్నర అడుగుల నాగుపాముని గుర్తించిన భవన నిర్మాణ కార్మికులు వెంటనే స్నేక్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న సిబ్బంది పామును పట్టుకుని పరిశీలించగా, పాము పొట్ట భాగంలో ఏదో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే దాన్ని ఒడిశా యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీ మూగజీవాల చికిత్స విభాగానికి తరలించారు. అక్కడ పాముకి ఎక్స్‌–రే తీసి చూడగా పాము పొట్టలో సీసా మూత ఉన్నట్లు నిర్ధారించారు డాక్టర్లు. అనంతరం మూగజీవాల శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్‌ ఇంద్రమణి నాథ్, రేడియాలజీ నిపుణులు డాక్టర్‌ సిద్ధార్థ్‌ శంకర బెహరా ఆ పాముకు విజయవంతంగా శస్త్ర చికిత్స చేసి, సీసా మూతను తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం పాము ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు గానూ, వారం రోజుల పాటు దానిని అబ్జర్వేషన్‌లోనే ఉంచారు. నాలుగు రోజుల తర్వాత దానికి ద్రవ పదార్థాలను మాత్రమే ఆహారంగా ఇచ్చి, క్రమంగా కోలుకునేలా జాగ్రత్తగా చూసుకున్నారు. ప్రస్తుతం పాము పరిస్థితి బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు.

మరిన్ని చూడండి ఇక్కడ:

NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..

Titanic ship Tour Viral: సముద్రంలో టైటినిక్‌ షిప్‌ను చూడొచ్చు.. తెగ ఆసక్తి చూపుతున్న జనం.! వైరల్ అవుతున్న వీడియో.

Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..

Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)

anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)

Python Viral Video: బాబోయ్‌ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..

Kajal Aggarwal: పంచదార బొమ్మ ‘కాజల్ అగర్వాల్’ మరోసారి అదిరిపోయే బేబీ బంప్‌ ఫొటోలను ఫ్యాన్స్‌తో పంచుకుంది..

Viral Video: రష్యా సైనికులకు ఓ ‘మోడల్‌’ ఆఫర్‌.. పుతిన్‌ను ఎదిరించిన వారికి పడక సుఖాన్ని అందిస్తా..! (వీడియో)

Follow us on