అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్నకు.. కలెక్టర్ జవాబిది!

Updated on: Jan 23, 2026 | 9:35 AM

శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్థానిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో గడిపారు. ఆయన తన ఐఏఎస్ ప్రయాణం వివరించి, గణిత పాఠాలు బోధించారు. కెరీర్ మార్గదర్శకత్వం చేస్తూ, మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. సొంతంగా తన ప్లేట్‌ను శుభ్రం చేసి నిరాడంబరత, క్రమశిక్షణ విలువలను చాటిచెప్పారు. ఆయన పట్టుదల, కృషి ఆవశ్యకతను నొక్కిచెప్పారు.

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మంగళవారం శ్రీకాకుళం బలగ లోని ప్రభుత్వ మున్సిపల్ హై స్కూల్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన స్కూల్ లో దాదాపు గంటసేపు విద్యార్థులతో గడిపారు. ఈ క్రమంలో ఓ విద్యార్థి మీరు IAS కి ఎలా సెలెక్ట్ అయ్యారు అని అడగ్గా మహారాష్ట్ర కు చెందిన ఆయన తను ఐఏఎస్‌ ఎలా అయ్యారో విద్యార్ధులకు వివరించారు. స్కూల్ లోని 10Th క్లాస్ చదివే రైజింగ్ స్టార్స్, స్కైస్టార్స్ గ్రూప్ లకు చెందిన విద్యార్థులతో ఆయన ఇంటరాక్ట్ అయ్యారు. స్వతహాగా గణిత విద్యార్థి అయిన కలెక్టర్ తనకు ఇష్టమైన మ్యాథ్స్ సబ్జెక్ట్ ను కాసేపు విద్యార్థులకు బోధించారు. గణితంలో మెళకువలు నేర్పారు. కఠినమైన లెక్కలను సైతం సులువుగా ఎలా పరిష్కరించాలో విద్యార్థులకు బోర్డుపై చేసి చూపించారు. గణితంలో ఉన్న మెళకువలు వివరిస్తుంటే విద్యార్థులు ఆసక్తిగా విన్నారు. అనంతరం విద్యార్థులు అడిగిన పలు సందేహాలను ఆయన ఓపికగా నివృత్తి చేశారు. ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తో పాటు వృత్తి విద్యా కోర్సులపై విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం స్కూల్ లో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును కలెక్టర్‌ పరిశీలించారు. విద్యార్థులతో కలిసి స్కూల్ లో ఆయన భోజనం చేశారు. ఈ సందర్భంగా భోజనం రుచిగా ఉంటుందా? మెనూ ప్రకారం అన్నీ వడ్డిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. భోజనం ముగిసాక కలెక్టర్ తాను భోజనం చేసిన ప్లేటును తానే స్వయంగా శుభ్రం చేశారు. క్రమశిక్షణతో పాటు మన పనులని మనమే చేసుకోవాలని తన చర్య ద్వారా విద్యార్థులకు చాటి చెప్పారు. కలెక్టర్ నిరాడంబరత అక్కడున్న వారందరినీ ఆకట్టుకుంది. పట్టుదల, తగిన కృషి ఉంటే ఎలాంటి లక్ష్యమైనా సాధించగలమని విద్యార్థులకు తెలిపారు. పాఠశాల ప్రాంగణం పరిశుభ్రంగా ఉందని స్కూల్ ఉపాధ్యాయులను, సిబ్బందిని అభినందించారు కలెక్టర్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్తవ్యం కానిస్టేబుల్ కు.. ఏపీ హోం మంత్రి ఆత్మీయ సత్కారం

ఒకే చోట పూజ.. నమాజ్ ! సుప్రీం సంచలన తీర్పు

ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు

మొక్కులో వింత.. భక్తుల్లో మంట !! తప్పు ఒప్పుకున్న టీనా శ్రావ్య

టోల్‌ బకాయిలుంటే వాహన సేవలు బంద్‌