అమెరికాలో అరుదైన దృశ్యం.. ఇలా జరిగిన సూర్య గ్రహణం ఇలా.. వీడియో ఇదిగో
సంపూర్ణ సూర్యగ్రహణం.. సోమవారం అంతరిక్షంలో చోటుచేసుకున్న ఈ అద్భుతాన్ని నార్త్ అమెరికా వాసులతో పాటు మెక్సికో, కెనడా వాసులు ఆసక్తిగా చూశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పాక్షిక గ్రహణం మాత్రమే కనిపించగా.. నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం 4.28 నిమిషాల పాటు కనువిందు చేసింది. గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ గా వ్యవహరించిన ఈ గ్రహణాన్ని వీక్షించేందుకు అమెరికన్లు నార్త్ కు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి మెక్సికో తీర ప్రాంతాలకు చేరుకున్నారు.
సంపూర్ణ సూర్యగ్రహణం.. సోమవారం అంతరిక్షంలో చోటుచేసుకున్న ఈ అద్భుతాన్ని నార్త్ అమెరికా వాసులతో పాటు మెక్సికో, కెనడా వాసులు ఆసక్తిగా చూశారు. ప్రపంచంలోని పలు దేశాల్లో పాక్షిక గ్రహణం మాత్రమే కనిపించగా.. నార్త్ అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం 4.28 నిమిషాల పాటు కనువిందు చేసింది. గ్రేట్ అమెరికన్ ఎక్లిప్స్ గా వ్యవహరించిన ఈ గ్రహణాన్ని వీక్షించేందుకు అమెరికన్లు నార్త్ కు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి మెక్సికో తీర ప్రాంతాలకు చేరుకున్నారు. మరికొందరైతే ఆకాశంలో నుంచి గ్రహణాన్ని చూడాలని విమాన ప్రయాణం చేశారు. దీనికోసం పలు విమాన సంస్థలు ప్రత్యేకంగా విమానాలను కూడా నడిపాయి. ఇక సూర్యగ్రహణాన్ని చూడలేని వారి కోసం నాసా లైవ్ పోగ్రాం నిర్వహించింది. అంతరిక్షం నుంచి సూర్యగ్రహణాన్ని లైవ్ లో చూపించింది. గ్రహణ కాలంలో నార్త్ అమెరికాతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను చీకట్లు కమ్మేసిన దృశ్యాలను కెమెరాలో బంధించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అమెరికాలో కిడ్నాప్‌కు గురైన హైదరాబాదీ మృతి.. ఇది పదకొండవ మరణం