గోవా రైల్లో బుస్‌.. బుస్‌..సెకెండ్‌ ఏసీలో కర్టెన్‌ తీసి చూస్తే షాక్‌..

|

Oct 31, 2024 | 8:46 PM

రైలులో గోవాకు వెళుతున్న వృద్ధ దంపతులకు ఊహించని షాక్ తగిలింది. వారు బుక్ చేసుకున్న లోయర్ బెర్త్ కిటికీ కర్టెన్ వెనుక పాము బుసలు కొట్టింది. ఊహించని ఈ ఘటనతో ఆ వృద్ధ దంపతులు కంగుతున్నారు. జార్ఖండ్‌లోని జసిదిహ్ నుంచి.. గోవాకు సెకండ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. తొలతు కిటికీ తెర వెనకాల ఏదో కదులుతున్నట్లు వృద్ధ దంపతులు గమనించారు.

నిశితంగా పరిశీలించగా విషసర్పం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఫోన్ ద్వారా తమ కుమారుడికి సమాచారం అందించారు. సహాయం కోసం IRCTC సిబ్బందిని సంప్రదించారు. రైల్వే సర్వీస్ బృందం వేగంగా స్పందించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని విషపూరిత పామును పట్టుకుని రైలు నుంచి బయటకు తీశారు. జార్ఖండ్-గోవా మధ్య నడిచే వాస్కో-డగామా వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. తన తల్లిదండ్రుల కోసం టిక్కెట్లు బుక్ చేసిన ఆ యువకుడు బెర్త్, రైలు వివరాలతో పాటు ఘటన తాలూకా వీడియోను ‘X’లో పంచుకున్నాడు. భారతీయ రైల్వే రైళ్లలో పాములు కనిపించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు సెప్టెంబర్‌లో గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ లో కూడా ఐదు అడుగుల పొడవున్న పాము ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

లక్కీ భాస్కర్.. హిట్టా ?? ఫట్టా ?? తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి

ఎల్పీజీ కంటే ఈ సిలిండర్‌ చాలా డేంజర్‌.. ఎందుకో తెలుసా ??