అద్దెకు ‘భర్త’లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో

Updated on: Dec 07, 2025 | 2:50 PM

మన దేశంలో కొందరు తల్లిదండ్రులు.. కూతురు పుడితే ఉసూరుమంటుంటారు. నగరాలలో ఉంటూ, పెద్ద ఉద్యోగాలు చేసే వారు సైతం ఆడపిల్లల చదువు, పెళ్లి వంటి బాధ్యతలను భారంగా భావిస్తున్న ఈ రోజులలో ఉత్తర ఐరోపాలోని లాత్వియాలో మాత్రం విచిత్రమైన పరిస్థితి ఉంది. ఆ దేశంలో పురుషుల సంఖ్య భారీగా తగ్గిపోతోంది. దీంతో మహిళలు తమ ఇంటి పనుల్లో సాయం కోసం భర్తలను అద్దెకు తెచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

తమకు ఇంటిపనిలో సాయం చేయగల పురుషులను వారు ఆన్‌లైన్‌లో గుర్తించి వారి సేవలను వినియోగించుకుంటున్నారు. ఇలా పనిచేసినందుకు గానూ రోజు, గంటకు ఇంత.. అని డబ్బు చెల్లిస్తున్నారు.లాత్వియాలో పురుషులు సంఖ్య పడిపోవడానికి ప్రధాన కారణం వారి ఆయుర్దాయం తగ్గడమేనట. స్త్రీ, పురుష లింగ నిష్పత్తిలో తేడా బాగా పెరగడం వల్లే.. లాత్వియా దేశంలో ఈ వింత పరిస్థితి వచ్చిందని.. ‘ది న్యూయార్క్‌ పోస్ట్‌’ ఓ కథనాన్ని ప్రచురించింది. లాత్వియాలో పురుషుల కన్నా మహిళలు 2 రెట్లు అధికంగా ఉన్నారు. దీంతో దేశంలో ఎక్కడ చూసినా ఆడవారే అధికంగా కనిపిస్తారు. దేశంలో మగవారి జనాభా భారీగా తగ్గడం వల్ల.. లాత్వియా మహిళలు.. భాగస్వామి కోసం విదేశీయుల వైపు చూడాల్సి వస్తుంది. మగ తోడు దొరక్కపోవడంతో.. ఇంటి పనుల్లో తమకు సాయం చేయడం కోసం లాత్వియా మహిళలు భర్తలను అద్దెకు తెచ్చుకుంటున్నారు. మరో విచిత్రం ఏంటంటే.. ఆన్‌లైన్ వేదికగా అద్దె భర్తలను ఆర్డర్ పెట్టుకుంటున్నారు. వారు ఇంటికి వచ్చాక.. అద్దె భర్తలతో కలిసి.. ఇంటి పనులు పూర్తి చేసుకుంటున్నారు. ఇందుకు గాను రోజులు, గంటల చొప్పున పురుషులను అద్దెకు తెచ్చుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం :

ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియో

టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి వీడియో

చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో

పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. తొడగొట్టి సవాలు విసురుతున్న 95 ఏళ్ల యువకుడు వీడియో