పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి.. అలా ఎలా మావా

Updated on: Jan 23, 2026 | 9:30 AM

మధ్యప్రదేశ్‌లో 47 ఏళ్ల వ్యక్తికి సోనోగ్రఫీలో తప్పుగా గర్భాశయం ఉన్నట్లు నివేదిక రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ వైద్య నిర్లక్ష్యంపై బాధితుడు షాక్ అవ్వగా, ఆరోగ్య శాఖ విచారణకు ఆదేశించింది. ఇటువంటి తప్పుడు రిపోర్టులు రోగుల ప్రాణాలకు ప్రమాదకరమని అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.

మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో జరిగిన ఓ విచిత్ర ఘటన స్థానికులను షాకయ్యేలా చేసింది. 47 ఏళ్ల పురుషుడికి సోనోగ్రఫీ టెస్ట్ చేసారు. స్కాన్ రిపోర్టులో అతడికి గర్భాశయం ఉందని రాశారు. ఆ గర్భాశయం తలకిందులుగా ఉందని రాసుకొచ్చారు. తీరా చూస్తే రిపోర్టులో తప్పుగా రాశారని తేలింది. ఘటన జరిగింది సాధారణ వ్యక్తికి కాదు. ఉచెహెరా నగర పంచాయతీ అధ్యక్షుడు నిరంజన్ ప్రజాపతి ఈ తప్పిదానికి బలయ్యారు. కొద్ది రోజులుగా ఆయనకు కడుపునొప్పి, వాపు సమస్యలు మొదలయ్యాయి. మొదట స్థానికంగా చికిత్స తీసుకున్నారు. ఉపశమనం లేకపోవడంతో జనవరి 13న సత్నాలోని ఒక డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లి స్కాన్ చేయించుకున్నారు. రిపోర్టు చూసిన తర్వాత ఆయనకు ఏం చేయ్యాలో అర్థం కాలేదు. పురుషుడైన తనకు గర్భాశయం ఉందని రాసి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. జబల్‌పూర్‌కు వెళ్లి డాక్టర్‌కు రిపోర్టును చూపించారు. సత్నా రిపోర్టును చూసిన వైద్యుడు ఆశ్చర్యపోయారు. “ఇది మీ రిపోర్టు ఎలా అవుతుంది? పురుషుడికి గర్భాశయం ఉండదు కదా” అని ప్రశ్నించారు. అప్పుడే ఈ తప్పిదం బయటపడింది. “ఈ తప్పు రిపోర్టు చూసి డాక్టర్ ఆపరేషన్ చేసుంటే ఎవరు బాధ్యత వహిస్తారు?” అని బాధితుడు వాపోయారు. ఈ ఘటన బయటకు రాగానే ఆరోగ్య శాఖలో కలకలం మొదలైంది. డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకుడిని సంప్రదించగా, ఈ విషయంపై స్పందించేందుకు నిరాకరించారు. మరోవైపు జిల్లా ఆరోగ్య అధికారి ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇది చిన్న తప్పు కాదని, రోగుల ప్రాణాలతో ఆడుకునే పని అని స్పష్టం చేశారు. పూర్తి విచారణకు ఆదేశాలు ఇచ్చామని, నిర్లక్ష్యం రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ఒక ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్లక్ష్యం వల్ల, ఓ వ్యక్తి జీవితం గందరగోళంగా మారే పరిస్థితి వచ్చింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కర్తవ్యం కానిస్టేబుల్ కు.. ఏపీ హోం మంత్రి ఆత్మీయ సత్కారం

ఒకే చోట పూజ.. నమాజ్ ! సుప్రీం సంచలన తీర్పు

ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు

మొక్కులో వింత.. భక్తుల్లో మంట !! తప్పు ఒప్పుకున్న టీనా శ్రావ్య

టోల్‌ బకాయిలుంటే వాహన సేవలు బంద్‌